యంగ్ టైగర్ ఎన్టీఆర్ భయపడే ఏకైక వ్యక్తి ఎవరంటే..?

తెలుగు చిత్రపరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నవరస నట సార్వభౌమ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో బాలకృష్ణ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్నారు. ఇక నేటి తరం నటుల్లో ఆ ఫ్యామిలిలో నుంచి వచ్చిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.

నందమూరి కాంపౌండ్ నుంచి కానీ.. తన టాలెంట్ తో వారి పేరును కాపాడుతూ ఒక్కో సినిమాతో ఒక్క మెట్టు ఎదిగారు. స్టార్ హీరోగా కొనసాగుతున్న ఆయన.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. కొమురం భీమ్ పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో.. ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయ్యారు.

who-is-the-only-person-young-tiger-ntr-is-afraid-of

అయితే ఎన్టీఆర్ కి ఒక వ్యక్తి అంటే చాలా భయం అంట. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తారక్ ఈ కామెంట్స్ చేయడం ఫుల్ హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆ వ్యక్తి ఎవరు ? ఎన్టీఆర్ ఎందుకు అంత భయపడతారు అని జోరుగా చర్చ నడుస్తోంది.

ఎవరంటే..?

ఎన్టీఆర్ఆ భయపడే వ్యక్తి ఎవరో కాదు.. ఆయన రెండో కొడుకు భార్గవ్ రామ్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం అంట. ఎందుకు అని ఎన్టీఆర్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అభయ్ ఒక క్వశ్చన్ బ్యాంక్.. వాడికి ఏదైనా కనిపిస్తే చాలు వెంటనే ప్రశ్నలు అడుగుతాడు. దాదాపు అడిగిన వాటికీ అన్నింటికీ ఓపిగ్గా ఆన్సర్ చెప్తాను. కానీ ఒక్కొక్కసారి వాడేం అడుగుతాడో అని భయపడతాను. అందుకే కనిపించకుండా పారిపోతానంటూ సరదాగా చెప్పుకొచ్చారు. దీంతో తారక్ ఫ్యాన్స్ అంతా జోక్ గా కామెంట్స్ చేస్తున్నారు.

who-is-the-only-person-young-tiger-ntr-is-afraid-of

ఇక రీసెంట్ గానే కొరటాల శివ దర్శకత్వంలో " దేవర " చిత్రంతో హిట్ కొట్టారు. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది ఆ మూవీ. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు.

మరోవైపు 'వార్‌ 2' సినిమాతో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఎన్టీఆర్. వార్‌ 2 సినిమాలో హృతిక్ రోషన్‌ హీరోగా నటిస్తూ ఉండగా.. కీలక పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. అలానే కొంత కాలంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ చిత్రం రాబోతుందని టాక్ నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+