తెలుగు ఇండస్ట్రీలో నెం.1 హీరో ఎవరో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. రాజమౌళి లాంటి దర్శకులు జాతీయస్థాయికి, అక్కడి నుంచి అంతర్జాతీయస్థాయికి పరిశ్రమను తీసుకువెళ్లారు. సుకుమార్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, బాబీ, అనిల్ రావిపూడి, లాంటి దర్శకులు దాన్ని అలాగే కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు స్టార్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా హీరోలయ్యారు. ప్రభాస్ తెలుగు హీరోకన్నా హిందీ హీరో అని చెప్పొచ్చు. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్లార్లు పాన్ ఇండియా హీరోలుగా చెలామణి అవుతున్నారు. దేశవ్యాప్తంగా వీరి పేరు మార్మోగుతోంది.

హాలీవుడ్ కు ధీటుగా తీయాలనే ప్రయత్నంలో
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు. ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్రణాళిక రచిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా దీన్ని నిర్మించేందుకు రాజమౌళి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏ భాషలో లేనివిధంగా మన తెలుగు పరిశ్రమలోనే ఎక్కువమంది స్టార్ హీరోలు ఉన్నారని చెప్పొచ్చు. ఇంతమంది స్లార్లు మరే భాషలో కనిపించరు. అందరూ స్టార్లే కావడంతో నెంబర్ 1 ఎవరు అనే చర్చ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అయితే నెంబర్ వన్ అనే స్థానం పదిలంగా ఉండటంలేదు. గతంలో అయితే కొన్ని సంవత్సరాలపాటు అలాగే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులున్నీ మారిపోయాయి.

who is the telugu film industry number one hero

తర్వాత సినిమాను బట్టి ఆధారపడివుంటుంది
ఎవరి సినిమా విడుదలై ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుందో ఆ సినిమాలో నటించిన హీరోనే నెంబర్ వన్ గా చెలామణి అవుతాడు. మరో సినిమా వచ్చి ఆ కలెక్షన్లు దాటేంతవరకు అతనే నెంబర్ వన్ హీరో. ఒకవేళ స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయితే తర్వాత సినిమా మీద అంచనాలు ఉండటంలేదు. కలెక్షన్ల ఆధారంగా ప్రథమ స్థానంలో నిలబడే హీరోను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా చూసుకుంటే బాహుబలి సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు తిరుగులేని విధంగా ప్రభాస్ ఒక్కడే హిందీ హీరోలను కూడా దాటేసి ప్రథమస్థానంలో నిలబడుతున్నాడు. పుష్ప2తో విజయం సాధించిన అల్లు అర్జున్ కు కూడా క్రేజ్ బాగా పెరిగింది. తర్వాత అతను ఎలాంటి సినిమా తీస్తాడనేదానిపై తన క్రేజ్ అలాగే నిలబడుతుందా? లేదా? అనేది తేలుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+