ఒకే హీరోతో 70 సినిమాల్లో నటించిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..?
సాధారణంగా సినీ ఇండస్ట్రీ హిట్ కాంబినేషన్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు. ఓ సినిమా హిట్ అయిందంటే , ఆ సినిమాలోని హీరో, హీరోయిన్లతో మరో సినిమా తీయడానికి మేకర్స్ అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఓ హీరోతో హీరోయిన్లు రెండు నుంచి నాలుగు సినిమాలు చేసే అవకాశం ఉంది. అలాంటిది ఓ హీరోయిన్ ఏకంగా ఒకే హీరోతో 70 సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..జయసుధ. ఆ హీరో ఇంకెవరో కాదు.. రెబల్ స్టార్ కృష్ణం రాజు.
తెలుగు ఇండస్ట్రీలో సహజ నటిగా జయసుధకు మంచి గుర్తింపు ఉంది. తొలితరం హీరోలందరితోనూ జయసుధ నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి స్టార్ హీరోలతో జయసుధ నటించారు. అందరి హీరోలకు ఆమె హిట్ పెయిర్‌గా నిలిచారు. స్టార్ హీరోలకు జయసుధ ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. అయితే హీరో కృష్ణం రాజుతో మాత్రం అత్యధిక సినిమాల్లో నటించారు. కృష్ణం రాజుతో కలిసి జయసుధ దాదాపు 70 సినిమాల్లో నటించారు.

వీరి కాంబినేషన్‌లో అనేక సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. వీరి మధ్య కెమిస్ట్రీ కూడా ఆ రేంజ్‌లో కుదిరింది. ఒకనొక సమయంలో వీరిద్దరి మధ్య ఎఫైర్ కూడా ఉందనే ప్రచారం జరిగింది. కానీ వీరు మాత్రం హుందాగానే ప్రవర్తించారు. ఒక ఇంటర్వ్యూలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. తాను చాలామంది హీరోయిన్లతో నటించాను కానీ, జయసుధ చేసినట్టుగా ఎవరూ చేయలేకపోయారని ఆమెపై ప్రశంసలు కురిపించారు.
నటన విషయంలో తనకు గట్టిపోటినిచ్చిన హీరోయిన్ జయసుధ ఒక్కరే అని కృష్ణం రాజు వెల్లడించారు. సీన్లు బాగా చేసేందుకు ఇద్దరు కోపరేట్ చేసుకునేవారట. అలా ఇద్దరూ పోటీ పడీ నటించేవారట. ఇద్దరి మధ్య అంతటి మంచి అనుబంధం ఉందని తెలిపారు కృష్ణం రాజు.












Click it and Unblock the Notifications