అల్లు అర్జున్‌ను తొక్కాలని చూస్తోంది అతనేనా?
తెలంగాణ అసెంబ్లీలో అల్లు అర్జున్ వ్యవహారశైలిపై, తర్వాత సినీ పరిశ్రమ స్పందించిన తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. తాను అధికారంలో ఉండగా బెనిఫిట్ షోలకు, అదనపు షోలకు, టికెట్ ధరలకు అనుమతిచ్చేది లేదని తేల్చిచెప్పారు. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బెనిఫిట్ షోలకు, టికెట్ ధరలకు ఇకనుంచి అనుమతులుండవని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో ఉన్నవారికి మానవత్వం లేదా? ఆసుపత్రిలో ఉన్న బాలుడిని కనీసం పరామర్శించలేదంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
కిందకు లాగేయాలని చూస్తున్నారు?
సంధ్య థియేటర్ లో అనుకోకుండా జరిగిన సంఘటన అని, అందులో ఎవరి తప్పు లేదన్నారు. తాను ఎవరినీ విమర్శించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. తన క్యారెక్టర్ ను తగ్గించి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సమాచార లోపంవల్లే ఇలా జరుగుతోందన్నారు. తెలుగువారు గర్వించే సినిమాలు తీయాలని తాను అనుకుంటున్నానని, పుష్ప2 సినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడ్డామని, తెలుగోడి సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటాలని చూస్తున్నానన్నారు. అయితే ఇటువంటి సమయంలోనే తనను కిందకు లాగేయాలని ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.

కొందరి పేర్లు చెబుతున్న బన్నీ అభిమానులు
అల్లు అర్జున్ ను తొక్కేయాలని చూస్తున్నారని, అందుకు కారణం వారేనంటూ బన్నీ అభిమానులు కొందరి పేర్లను చెబుతున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం వాటిని కొట్టేస్తున్నారు. వారికి ఆ అవసరం ఏమీ లేదన్నారు. పరిశ్రమలో ఎవరి టాలెంట్ ను బట్టి వారు పైకి ఎదుగుతుంటారని, అంతేకానీ ప్రత్యేకంగా కిందకు లాగాలని ఎవరూ ప్రయత్నించరని, అందులోను తమ హీరోలకు ఆ అవసరమే లేదని కామెంట్లు పెడుతున్నారు.
అయితే బన్నీ అభిమానులు మాత్రం ప్రత్యేకంగా కొందరు హీరోలను, కొందరు రాజకీయ నేతలను వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారికి సోషల్ మీడియాలో మద్దతు రావడంలేదు. బన్నీ అభిమానులు చేస్తున్న వాదనలో పస లేదని తేల్చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇకనుంచి చేసే సినిమాలు పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవుతాయని, మంచి మార్కెట్ ఏర్పడిందికదా అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications