సమంత ఫోన్‌లో my love అని ఉన్న నెంబర్ ఎవరిదో తెలుసా..?
సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. సమంత ఇటీవల సినిమాల్లో కన్నా వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తున్నారు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. మయసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత, ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు.దీంతో వరుస సినిమాలను లైన్లో పెడుతోంది.
విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తర్వాత సమంత మరో తెలుగు సినిమాలో నటించలేదు. 'సిటాడెల్' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో మాత్రం సమంత నటించారు. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ వెబ్ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇదే సమయంలో సమంత చాలాకాలం తర్వాత తన తెలుగు సినిమాను ఎనౌన్స్ చేశారు.'మా ఇంటి బంగారం' సినిమాతో సమంత తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుంది.ఈ సినిమాకు సమంతనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.సమంత తెలుగులో రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా, సమంత గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. సమంత ఫోన్ కాంటాక్ట్స్‌లో ఓ నెంబర్ my love అని సేవ్ చేసి ఉంటుందట. అయితే ఆ నెంబర్ ఎవరిది అయి ఉంటుందనే దానిపై నెటిజన్లలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు తన మాజీ భర్త నాగ చైతన్య నెంబర్‌ను ఇంకా అలానే సేవ్ చేసి ఉంటుందని అభిప్రాయపడగా, మరికొందరు తనకు సినిమాలో మొదటిసారి అవకాశం ఇచ్చిన గౌతమ్ మీనన్ నెంబర్ అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
లేదంటే తన సన్నిహితుల నెంబర్‌ను అలా సేవ్ చేసుకుని ఉంటుందని అంతా భావించారు. కానీ సమంతం my love అని తన తండ్రి నెంబర్‌ను సేవ్ చేసుకుందట. ముఖ్యంగా తండ్రి జోసెఫ్ ప్రభు సమంతను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆమె సినిమాల్లోకి వస్తానన్నప్పుడు కూడా ఆయన ఎటువంటి అడ్డంకి చెప్పలేదు. ఇదే సమయంలో నాగ చైతన్యతో పెళ్లిని సైతం ఆయన అంగీకరిచారు.దీంతో సమంత జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా తండ్రి జోసెఫ్ ప్రభు ఉన్నారు. జోసెఫ్ ప్రభు 2024 నవంబర్ నెలలోనే మరణించారు.












Click it and Unblock the Notifications