సమంతపై నాగ చైతన్య రివేంజ్ అదిరిపోయింది..ఆగస్టు 8 తేదీనే నిశ్చితార్థం అందుకే..?
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. చివరికి నాగ చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు షాకిచ్చారు.

తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నాగార్జున సోషల్ మీడియాలో వదిలారు. నాగచైతన్య కూడా వీరి నిశ్చితార్థం ఫొటోలు ఇన్‌స్టా స్టోరీలో పెట్టాడు. నాగ చైతన్య ఇలా . ఆగస్టు 8వ తేదీనే ఎందుకు నిశ్చితార్థం చేసుకున్నారని విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ తేదీ నాగ చైతన్య, సమంతల జీవితంలో చాలా స్పెషల్ అని తెలుస్తోంది. ఆగస్టు 8వ తేదీ నాడే నాగచైతన్యకు సమంత ప్రపోజ్ చేసిందట. ఇప్పుడు వీరి రిలేషన్ బ్రేక్ అయ్యాక సమంతకు బుద్ధి చెప్పేలా ఇదే తేదీన తన లైఫ్‌లో కొత్త స్టెప్ తీసుకున్నాడని తెలుస్తోంది సమంతపై పర్ఫెక్ట్ స్వీట్ రివెంజ్ తీసుకున్నాడని అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications