పూనమ్‌కౌర్ టార్గెట్ త్రివిక్రమ్ శ్రీనివాస్... ఎందుకంటే..?
ఒకప్పటి అందాల నటి పూనమ్ కౌర్ అనేక సందర్భాల్లో అనేకన్నా.. సందర్భం ఉన్నా లేకపోయినా.. దాన్ని సృష్టించుకొనైనా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తీవ్రస్థాయిలో మండిపడుతుంది. ఆ మాటల మాంత్రికుడు మాత్రం ఇంతవరకు నోరు విప్పలేదు. పూనమ్ చేసే విమర్శలకు ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక్కడ రెండురకాలుగా ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోందంటున్నారు సినీ విశ్లేషకులు. విమర్శకు మనం స్పందిస్తే తప్పు మనవైపు ఉన్నట్లు అవుతుంది..
అసలు మాట్లాడకుండా ఉంటే మంచిది అనే ఆలోచన కావొచ్చు. ఇది మొదటి ఆలోచన కాగా.. రెండో ఆలోచన ఏంటంటే.. ఏ ఒక్క విమర్శకు స్పందించకుండా ఉంటే.. అసలు మనల్ని కాదు అనుకుంటే ఏ గొడవా ఉండదు అనే భావన ఉండివుండొచ్చు. అలా ఉంటే ఆమే ఎన్నిసార్లయినా విమర్శించుకుంటుంది.. ఎన్నిసార్లయినా ప్రస్తావిస్తూనే ఉంటుంది.. పట్టించుకోకుండా ఉంటే ఏ గొడవా ఉండదు.

ప్రతి చిన్న విషయానికీ టార్గెట్
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ తరహా ఆలోచనలతో ఉండి ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏకమైనప్పటికీ కారణం లేకుండా పూనమ్ కౌర్ మాత్రం త్రివిక్రమ్ పై ఈ స్థాయిలో మండిపడదని, ఏదో బలమైన కారణం ఉందని, ఆమె ఏదో తీవ్రంగా నష్టపోయిందనేది అర్థమవుతోందని ఆమె మాటలను బట్టి అర్థమవుతోందంటున్నారు. అందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారకుడై ఉంటాడని, అందుకే ఆమె మాటల మాంత్రికుడినే ప్రతి చిన్న విషయానికి టార్గెట్ చేస్తోందంటున్నారు.
వాస్తవానికి మన భారతీయ సంప్రదాయం ప్రకారం స్త్రీని ఇబ్బంది పెట్టకూడదు.. ఏడిపించకూడదు.. బాధకు గురిచేయకూడదు.. మనోవేదనకు అసలు గురిచేయకూడదు.. ఏ ప్రకారం చూసినా స్త్రీకి నష్టం కలిగివుండకూడదు. అందుకు కారకుడైన వ్యక్తి అంతకు రెట్టింపు స్థాయిలో నష్టపోతాడు. కర్మను అనుభవించాల్సి ఉంటుంది. అది ఈ జన్మలో కాకపోయినా తర్వాత జన్మలో అయినా కచ్చితంగా జరిగి తీరుతుందనేది కర్మ సిద్ధాంతాన్ని పాటించేవారు బలంగా నమ్ముతారు.
కారణం బయటకు రాలేదు కానీ..
కారణం బయటకు రానప్పటికీ పూనమ్ కౌర్ కు మాత్రం త్రివిక్రమ్ వల్ల ఏదో నష్టం జరిగివుంటుందనే అభిప్రాయం మాత్రం సినీ పరిశ్రమలో వ్యక్తమవుతోంది. అది ఏమిటనేది ఆమెకు, త్రివిక్రమ్ కు మాత్రమే తెలియాలి. ఇంతగా విమర్శిస్తున్న స్త్రీకి ఈరోజు వరకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండటం అనేది అందరికీ సాధ్యంకాదు. ఏది ఏకమైనప్పటికీ ఈ విషయంలో మాత్రం త్రివిక్రమ్ కు ఓర్పు చాలా ఎక్కువ అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications