pushpa2: 'పుష్ప2'తో మరో వివాదానికి తెరలేపిన అల్లు అర్జున్

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 సినిమాకు సంబంధించి ముందస్తు విడుదల వేడుకను హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భారీగా నిర్వహించారు. అలాగే సినిమా ట్రైలర్ విడుదల వేడుకను పాట్నాలో నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతోపాటు చెన్నైలోని ఓ కాలేజీలో కూడా ముందస్తు విడుదల వేడుక నిర్వహించారు. హైదరాబాద్ కాకుండా మిగతాచోట్ల సమయం లేకపోవడంతో దర్శకుడు హాజరుకాలేదు. హీరో, హీరోయిన్లతోపాటు నిర్మాతలు, ఇతర నటులు పాల్గొన్నారు. హైదరాబాద్ వేడుకకు రావు రమేష్, ఫాహద్ ఫజిల్, సునీల్ లాంటివారు హాజరుకాలేదు. సినిమా విడుదలవడానికి మరో 24 గంటల సమయమే మిగిలివుంది.

రెండురోజులు ఆలస్యంగా ప్రకటించారు
దీనికి ఒకరోజు ముందుగా ఏపీలో టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే ఈ విషయాన్ని రెండురోజులు ఆలస్యంగా ప్రకటించారు. ఏపీలో ఉన్నవారు కూడా అల్లు అర్జున్ అభిమానులే. అక్కడే ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. పుష్ప1 సినిమాకు వైసీపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతివ్వలేదు. ఇప్పుడు మెగా కుటుంబంతో దూరంగా ఉంటున్నప్పటికీ పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండటం, సినీరంగానికి చెందిన వ్యక్తి కావడంతో అనుమతులు సులభంగా వచ్చాయి. సినీరంగాన్ని ప్రోత్సహిస్తామని ముందునుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. అయితే పరిశ్రమకు చెందినవారు మాత్రం ముందుకు రావడంలేదు.

why pushpa2 movie pre release event not conduct in ap

ఏపీలో మాత్రం నిర్వహించలేదు
హైదరాబాద్ లో నిర్వహించిన పుష్ప2 ముందస్తు విడుదల వేడుక ఏపీలో మాత్రం నిర్వహించలేదు. అందుకు కారణం సమయం లేదని చెప్పొద్దు అంటున్నారు ఏపీ అభిమానులు. తమిళనాడులో నిర్వహించడానికి ఉన్న సమయం ఏపీలో నిర్వహించడానికి లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. పవన్ కల్యాణ్ టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చారని, అది కూడా లేకపోతే కలెక్షన్లు రావని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు. చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ అక్కడ సినీ రంగానికి ఊతమిచ్చేలా ఏ ఒక్క హీరో ముందుకు రావడంలేదు. అయితే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ముందస్తు విడుదల వేడుక మాత్రం అమరావతిలో జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏ హీరో అయినా టికెట్ ధరల కోసం ప్రభుత్వాలను వాడుకోవడమే సరిపోతోందికానీ ప్రభుత్వాలకు ఏం కావాలనే విషయం మాత్రం ఆలోచించడంలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+