20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది!
'ధురంధర్', 'ధురంధర్: ది రివేంజ్' చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. అయితే ఈ సినిమాల షూటింగ్ ప్రారంభం నుంచి విడుదల వరకు ఓ విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది అయితే ఈ రెండు సినిమాల్లో స్టార్ హీరో రణవీర్ సింగ్ సరసన ఆయన కంటే దాదాపు 20 ఏళ్లు చిన్న సారా అర్జున్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయడంపై గతంలో భారీ చర్చే నడిచింది. ఈ జంటమధ్య వయస్సు తేడాపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడిచాయి. తాజాగా ఈ ఎంపిక వెనుక ఉన్న అసలు కారణాలను ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ ఛాబ్రా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆదిత్య ధర్ ఆశ్చర్యపోయాడు..
కాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ ఛాబ్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. సారా అర్జున్ ఆడిషన్ వీడియో చూసినప్పుడు డైరెక్టర్ ఆదిత్య ధర్ ఒక్కసారిగా షాక్ అయ్యారట. ఆ సీన్‌లో సారా నటన చూసి.. "ఈ అమ్మాయి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది?" అని ముకేష్ ఛాబ్రాను ఆశ్చర్యంగా అడిగారట. "సారా అర్జున్ చేసిన ఆ ఆడిషన్ సీన్ ఎంత అద్భుతంగా ఉందంటే.. చూడగానే ఆదిత్య పూర్తిగా ముగ్ధుడైపోయారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సారా అర్జున్‌ను హీరోయిన్ గా ఖరారు చేసేశాం" అని ముకేష్ ఛాబ్రా వెల్లడించారు. త్వరలోనే సారా అర్జున్‌కు సంబంధించిన ఆ సీక్రెట్ ఆడిషన్ వీడియోను కూడా విడుదల చేస్తామని.. అది చూస్తే ఆమె ఎంపిక సరైనదే అని అందరికీ అర్థమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వేల మందిని కాదని సారానే ఎందుకు?
ఈ సినిమాలో "యలీనా జమాలీ" అనే అత్యంత కీలకమైన పాత్ర కోసం ముకేష్ ఛాబ్రా టీమ్ వేల సంఖ్యలో ఆడిషన్స్ నిర్వహించింది. ఇందులో పలువురు అగ్ర హీరోయిన్లు, పాపులర్ ముఖాలు ఉన్నప్పటికీ.. సారా అర్జున్ వైపే మొగ్గు చూపడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఫ్రెష్ అప్పీల్. స్టోరీ ప్రకారం రణవీర్ సింగ్ ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లినప్పుడు.. అక్కడ అతనికి పరిచయమయ్యే అమ్మాయి ప్రేక్షకులకు ఎక్కడా చూసినట్లు ఉండకూడదని టీమ్ భావించింది. ఎలాంటి భారీ ఇమేజ్ లేని కొత్త ముఖం అయితేనే ఆ పాత్రకు సహజత్వం వస్తుందని వారు నమ్మారు.
వయస్సు తేడానే ప్లస్ పాయింట్!
రణవీర్ సింగ్ పక్కన సారా అర్జున్ చాలా చిన్నదిగా కనిపిస్తుందని మొదట కాస్త సందేహం వ్యక్తమైనా.. అదే సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని సినిమా యూనిట్ భావించింది. కథా క్రమంలో రణవీర్ ఆ అమ్మాయిని ఆకర్షించే ప్రయత్నం చేయాలి.. ఆ సన్నివేశాల్లో వీరిద్దరి మధ్య ఉండే వయస్సు వ్యత్యాసం ఓ రకమైన కొత్త కెమిస్ట్రీని పండిస్తుందని సినిమా మేకర్స్ నిర్ణయించుకున్నారు. సారా అర్జున్‌కు అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'పొన్నియిన్ సెల్వన్' వంటి భారీ సినిమాల్లో నటించిన అనుభవం ఉండటంతో కెమెరా ముందు ఆమె చాలా పరిణతి చెందిన నటనను కనబరిచింది.
బాల్యనటి నుంచి గ్లోబర్ స్టార్ వరకు..
సారా అర్జున్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. ఆమె ప్రముఖ నటుడు రాజ్ అర్జున్ కూతురు కూడా. కేవలం 20 ఏళ్ల వయస్సులోనే ఆమె దాదాపు 22 సినిమాలు, పలు యాడ్స్, వెబ్ సిరీస్‌లలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 'జజ్బా', 'జై హో', 'ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా' వంటి సినిమాలతో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న సారా అర్జున్.. ఇప్పుడు 'ధురంధర్', 'ధురంధర్ 2' సినిమాలతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ను అందుకుంది. చిన్న వయస్సులోనే ఇంతటి భారీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేయడమే కాకుండా, తన నటనతో విమర్శకుల నోళ్లు మూయించిన సారా అర్జున్ ప్రస్తుతం బాలీవుడ్ సెన్సేషన్‌గా మారింది.
-
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
ఆశాభోస్లే - లతా మంగేష్కర్.. అక్క చెల్లెల మధ్య అసలు గొడవేంటి ??? -
ఆశా భోంస్లే 'స్వర' సామ్రాజ్యం.. ఆస్తుల గురించి షాకింగ్ నిజాలు! -
మోనాలిసాకు ఊహించని షాక్: భర్తపై పోక్సో కేసు -
దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను.. -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు












Click it and Unblock the Notifications