మహేశ్ బాబుకు తండ్రిగానా..? రెండు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేశ్.. హిట్స్ .. ప్లాఫ్స్ అని తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక్కో సినిమాకు తన ఇమేజ్ ను పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' చిత్రంలో నటిస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలై టైటిల్ గ్లింప్స్ లోని దృశ్యాలు యావత్ ప్రపంచంలోని సినీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాయి. 2027 వేసవి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తండ్రిగా నటించేందుకు ఆయా దర్శక నిర్మాతలు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గరకు రెండు సార్లు వెళ్లారు. అయితే అనుకోని కారణాల వల్ల రెండు సార్లు రజనీకాంత్ ఈ సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. దాంతో మహేశ్ బాబు.. రజనీకాంత్ కాంబో రావాల్సిన రెండు సినిమాలు మిస్ అయ్యాయి. రెండు సార్లూ తండ్రి పాత్రల్లోనే రజనీకాంత్ కు ఆఫర్ వచ్చింది. అయితే పలు కారణాల వల్ల ఆయన రిజెక్ట్ చేశారు. ఆ మూవీస్ వివరాలు చూస్తే..

మహేశ్ బాబు- శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన దూకుడు చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టించిందో తెలిసిందే. అప్పటివరకూ తెలుగు చిత్రసీమ రికార్డుల్ని ఈ మూవీ చెరిపేసింది. బాక్సాఫీస్ వద్ద కొత్త లెక్కల్ని పెట్టింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీలో మహేశ్ తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించిన విషయం తెలిసిందే. అయితే మొదట ఈ పాత్రకు సూపర్ స్టార్ రజనీకాంత్ ను అనుకున్నారట. కానీ కానీ ఆయనకి ఆ క్యారెక్టర్ నచ్చకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అలాగే మహేశ్ బాబు- వెంకటేశ్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోనూ తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించారు. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ తెచ్చుకుంది. ఈ మూవీకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీలో మహేశ్- వెంకటేశ్ లకు తండ్రిగా రజనీకాంత్ ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించిందట.

Why Thalaivar Said No Rajinikanth Rejects Father Role to Mahesh Babu Twice

అయితే ఈ మూవీలోని తండ్రి క్యారెక్టర్ రజనీకాంత్ కు బాగా నచ్చింది. కానీ మహేశ్ బాబు- వెంకటేశ్ అప్పటికే టాప్ హీరోలుగా ఉన్నారు. తాను కూడా మూవీలో నటిస్తే.. సినిమా మీద అంచనాలు భారీగా పెరుగుతాయి. దాంతో ప్రేక్షకులు ఆ సినిమాను సరిగ్గా రిసీవ్ చేసుకోలేరేమో అన్న సందేహంతో రజనీకాంత్ ఆ మూవీని సైతం రిజెక్ట్ చేసినట్లు సమాచారం. దాంతో ఈ రెండు సినిమాల్లోనూ రజనీకాంత్ తో నటించే ఛాన్స్ మహేశ్ బాబు మిస్ అయ్యారు. మరి ఫ్యూచర్ లోనైనా వీరి కాంబోలో ఓ మూవీ వస్తుందో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+