Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్టార్ హీరో ఫ్యామిలీలో చిచ్చు, సినీనటి దెబ్బకు హీరో భార్య మైండ్ బ్లాక్, మా సంబంధం ?

స్యాండిల్ వుడ్ లో ఇప్పుడు భారీ హిట్ సినిమాగా నిలిచిన కాటేరా సినిమాతో ఆ సినిమా హీరో చాలెంజింగ్ స్టార్, డి బాస్ దర్శన్ తో పాటు ఆయన అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండాపోయింది. ఇప్పటికే రూ 200 కోట్ల మార్కు దాటేసిన కాటేరా సినిమా రూ 250 కోట్ల క్లబ్ లో చేరడానికి పరుగులు తీస్తోంది. ఇక దర్శన్ అభిమానుల ఆనందం హద్దులు దాటింది.

ఇదే సమయంలో హీరో దర్శన్ ఫ్యామిలీలో గొడవలు భగ్గుమన్నాయి. చాలెంజింగ్ స్టార్ దర్శన్ భార్య విజయలక్ష్మి, మరో నటి పవిత్రా గౌడ సోషల్ మీడియా వేదికగా నువ్వానేనా అంటూ వార్ మొదలుపెట్టారు. ఈ దెబ్బతో చాలెంజింగ్ స్టార్ దర్శన్ ఫ్యామిలీ గొడవలకు సోషల్ మీడియా వేదిక కావడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. దర్శన్ భార్య విజయలక్ష్మి, కన్నడ నటి పవిత్రా గౌడ ఇప్పుడు చాలెంజింగ్ స్టార్ విషయంలో ఒకరి మీద ఒకరు చాలెంజ్ లు చేసుకుంటున్నారు.

Wife Vijayalakshmi and film actress Pavitra Gowda are fighting on social media for star hero Darshan

ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, పవిత్ర గౌడల లింక్ విషయం మళ్లీ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. దర్శన్‌తో ఆమెకు ఉన్న సంబంధం గురించి తరచుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ స్టార్ హీరో దర్శన్, పవిత్రా గౌడల సంబంధం విషయం తెరపైకి వచ్చింది. పవిత్ర గౌడ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలే ఇందుకు కారణం. పవిత్ర గౌడ కొన్ని కన్నడ సినిమాల్లో కూడా నటించింది. దర్శన్, పవిత్ర గౌడ ప్రేమలో ఉన్నారని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.

పవిత్ర గౌడ తరచూ దర్శన్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకునేది. దర్శన్‌తో కలసి చాలా ఫొటోలు పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసిన పవిత్ర గౌడ పెట్టిన ఓ క్యాప్షన్ హాట్ టాపిక్ అయ్యింది. దీనితో పాటు మా సంబంధం పూర్తి అయ్యి 10 సంవత్సరాలైంది అని పవిత్రా గౌడ సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది. పవిత్రా గౌడ ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వెంటనే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గత ఏడాది కూడా పవిత్రా గౌడ తన కుమార్తె పుట్టినరోజు వేడుకల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో పవిత్రా గౌడ, ఆమె కూతురితో కలిసి స్యాండిల్ వుడ్ హీరో దర్శన్ కూడా ఉన్నాడు. పవిత్రా గౌడ కూతురుతో దర్శన్ డ్యాన్స్ లు చేసి సంబరాలు చేసుకున్నాడు. పవిత్రా గౌడ కుమార్తెతో కలిసి దర్శన్ కేక్ కట్ చేశారు. దర్శన్ ఆమెను హ్యాపీ బర్త్ డే బ్యూటిఫుల్ అని రాసి ట్యాగ్ కూడా చేశాడు.

అంతే కాకుండా కొన్నాళ్ల క్రితం పవిత్రా గౌడ, దర్శన్‌ లు కలిసి తీసుకున్న ఓ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అక్కడి నుంచి దర్శన్, పవిత్రా గౌడల అనుబంధంపై చర్చ సాగింది. ఇప్పుడు పవిత్రా గౌడ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యడమే కాకుండా తమ 10 సంవత్సరాల బంధాన్ని అధికారికంగా వెల్లడించినట్లు అయ్యింది. అయితే నటి పవిత్రా గౌడ గురించి దర్శన్ అధికారికంగా ఎక్కడా మాట్లాడలేదు.

Wife Vijayalakshmi and film actress Pavitra Gowda are fighting on social media for star hero Darshan

పవిత్రా గౌడ కుమార్తె పుట్టినరోజు వేడుకలో కనిపించడం మినహా దర్శన్ ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే అంతకుముందు కొన్ని మీడియాలలో దర్శన్, పవిత్రా గౌడల సంబంధం గురించి నివేదించింది. ఇది పెను సంచలనం సృష్టించింది. ఇది కాకుండా దర్శన్ 46 వ పుట్టినరోజు సందర్భంగా ఓ రచ్చ జరిగింది. దర్శన్ పుట్టినరోజును పవిత్రా గౌడ ఆమె స్నేహితురాలు మేఘా శెట్టితో సహా చాలా మందితో జరుపుకుంది.

స్యాండిల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ పుట్టినరోజును పవిత్రా గౌడ, మేఘా శెట్టి, సోనాల్ తదితరులు చాలా గ్రాండ్‌గా జరుపుకున్నారు. మేఘా శెట్టి దానిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోపై దర్శన్ భార్య విజయలక్ష్మి వార్నింగ్ ఇచ్చింది. దర్శన్ భార్య విజయలక్ష్మి భార్య వార్నింగ్ ఇచ్చిన తరువాత పవిత్రా గౌడ నేరుగా దర్శన్‌తో కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ కావడంతో వైరల్ అయ్యాయి. పదేళ్ల మా బంధాన్ని కూడా బయటపెట్టిన పవిత్రా గౌడ హీరో దర్శన్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టినట్లు అయ్యింది. ఈ ఫోటోల విషయంలో చాలెంజింగ్ స్టార్ దర్శన్ భార్య విజయలక్ష్మి మండిపడుతున్నారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+