రాజకీయాల్లోకి కీర్తి సురేశ్ .. విజయ్ పార్టీలోకి ముహూర్తం ఫిక్స్ ?
తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించిన నటుడు విజయ్, తన పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) ద్వారా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, పార్టీ విస్తరణపై పూర్తి దృష్టి సారించి, ప్రజల్లోకి దూసుకువెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
పార్టీ పేరు, జెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ, బూత్ కమిటీలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నారు.TVK పార్టీ శ్రేణులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు. ప్రైవేట్ హార్డింగ్‌లు, వాల్స్‌ను ముందే బుక్ చేసుకుంటూ, వినూత్న కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ పార్టీలోకి మహానటి కీర్తి సురేశ్ చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

తాజాగా మదురైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి కీర్తి సురేష్ పాల్గొన్నప్పుడు, అభిమానులు "టీవీకే.. టీవీకే" అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో పాటు, కీర్తి సురేశ్ నటుడు విజయ్ ప్రారంభించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీలో చేరబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ ప్రచారంపై కీర్తి సురేశ్ ఇప్పటివరకు స్పందించలేదు.
ఆమె మౌనం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. దీంతో కీర్తి సురేష్ నిజంగానే విజయ్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కీర్తి సురేశ్ విజయ్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. ఇక కీర్తి సురేశ్ వివాహానికి సైతం విజయ్ స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లి మరి హాజరయ్యారు. దీంతో కీర్తి సురేశ్ విజయ్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. పార్టీలో నేరుగా చేరకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో కీర్తి సురేశ్ విజయ్‌కు మద్దతు తెలిపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.మరి ఈ వార్తలపై కీర్తి సురేష్ ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి. ఆమె రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications