రెండో పెళ్లి గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటా... పవన్ మాజీ భార్య..
రేణుదేశాయ్.. ఈ పేరు చెప్పగానే అందరికీ పవర్‌స్టార్ పవన్ కళ్యాణే గుర్తుకొస్తారు. ఎందుకంటే, పవన్‌కళ్యాణ్ మాజీ భార్యగానే ఆమె అందరికి సుపరిచితురాలు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు ఆమె. అయితే, ఆమె పెళ్లి, పిల్లలు, విడాకులు తర్వాత ఆమె సినీ ప్రస్థానం ముగిసిందనుకున్నారు చాలామంది. కానీ రేణుదేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. మాస్ మహరాజా రవితేజ నటిస్తోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఆమె ఒక కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే పవన్‌కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణుదేశాయ్ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గానే ఉంటున్నారు. అయితే, తాజాగా రేణుదేశాయ్ తన రెండో పెళ్లి గురించి ప్రస్తావించారు. ఈ పోస్ట్ కాస్త సోషల్‌మీడియాలో ఇప్పడు వైరల్‌గా మారింది. రెండో పెళ్లి గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటా అంటూ రేణుదేశాయ్ సోషల్‌మీడియా వేదికగా పేర్కొన్నారు.
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా : రేణు దేశాయ్ సింగిల్ మదర్‌గా ఉంటూ తన పిల్లల భాద్యతలు చూసుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉంటూ పిల్లల గురించి అనేక విషయాలను పంచుకుంటుంది. అయితే, అప్పట్లో రేణుదేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమవ్వడం, అది నిశ్చితార్థం వరకూ రావడం కూడా జరిగింది. అయితే, ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు అప్పట్లో రేణుదేశాయ్ పేర్కొంది.

ప్రస్తుతం రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 20న ఈ చిత్రం రిలీజ్‌కి సిద్ధం అవుతుంది. మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. తాజాగా, రేణుదేశాయ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి, ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అవ్వడం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే రెండో పెళ్లిపై నిర్ణయం : పవన్ నుంచి రేణుదేశాయ్ విడిపోయినప్పుడు అకిరా, ఆద్యల వయసు చాలా చిన్నది. అయితే, ఆ సమయంలో రెండో పెళ్లి చేసుకోమని కుటుంబసభ్యుల నుంచి స్నేహితుల నుంచి ఒత్తిడి వచ్చింది. అయితే కొన్నిరోజులకి రెండో పెళ్లికి ఒకే చెప్పా. నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ ఫోటోలని నేనే సోషల్ మీడియాలో షేర్ చేశా. అవి అప్పట్లో బాగా వైరల్ అయిపోయాయి. ఆ సమయంలో ఆద్య వయసు 7 ఏళ్ళు. చాలా చిన్నది ఆద్య.
ఇలాంటి సమయంలో నేను రెండో పెళ్లి చేసుకుంటే వారిని చూసుకోవడం సాధ్యపడదని అర్థమైంది. అందుకే ఆ పెళ్లి చేసుకోలేకపోయాను. ఆ ఎంగేజ్‌మెంట్‌ను కూడా రద్దు చేయాల్సి వచ్చింది. నీకు ఎవరైనా నచ్చినట్లు అనిపిస్తే పెళ్లి చేసుకోమ్మా అని చాలాసార్ల అకిరా నాతో చెబుతుంటాడు. ఇప్పడు ఆద్య పదమూడో ఏటకు వచ్చాడు. మరో రెండు మూడేళ్ళ తర్వాత రెండో పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకుంటా అని రేణు దేశాయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications