''యాత్ర 2'' రివ్యూ..సీఎం జగన్ బయోపిక్ ఎలా ఉందంటే...?
సరిగ్గా ఐదేళ్ల క్రితం మహీ వి.రాఘవ్ దర్శకత్వంలో యాత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2019 ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన యాత్ర బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
మళయాళ సూపర్ స్టార్ యాత్ర సినిమాలో వైఎస్ఆర్‌గా కనిపించి మెప్పించారు. ముఖ్యంగా వైఎస్ఆర్‌ను అభిమానించే ప్రతి ఒక్కరికి యాత్ర సినిమా గుండెలకు హత్తుకునేలా చేసింది. ఈ సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2ను అనౌన్స్ చేశాడు దర్శకుడు మహీ వి.రాఘవ్. మొదటి పార్ట్‌లో వైఎస్ఆర్ గురించి చూపించగా, యాత్ర 2లో ఆయన తనయుడు వైసీపీ అధినేత , సీఎం జగన్ గురించి తెర మీద చూపించడానికి రెడీ అయ్యాడు.

వైఎఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించగా...జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటించారు. ఈ రోజు (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర 2 పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో ప్రతి సన్నివేశం ఎమోషనల్‌గా సాగుతుంది. ముఖ్యంగా ఇచ్చిన మాట కోసం జైలుకు వెళ్లిన సందర్భం, ప్రజల కష్టల తెలుసుకోవడానికి జగన్ చేసిన పాదయాత్ర వంటి సన్నివేశాలు తెర మీద ఆకట్టుకున్నాయి.

చంద్రబాబు, సోనియా గాంధీలను తప్పుగా చూపిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ అలాంటి వాటికి చోటు లేకుండా కేవలం జగన్ ఇమేజ్‌ను మాత్రమే దర్శకుడు వాడుకున్నట్టు కనిపించింది. జగన్ రాజకీయ జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితులను ఎదుర్కొని తాను అనుకున్న లక్ష్యం ఎలా సాధించాడు అనే విషయాలను తెర మీద దర్శకుడు చాలా బలంగా చూపించాడు .యాత్ర 2లో మమ్ముట్టి కనిపించేది కొద్దిసేపే అయిన్నప్పటికి ఆయన తన పాత్రకు న్యాయం చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తీసిన యాత్ర 2 సినిమా ఎలా ఉంది..?#YSJagan #YSRajasekharReddy #CMYSJagan #Yatra #Yatra2 #Yatra2Review #BlockbusterYatra2 #Jiiva #Mammootty #MahiVRaghav #Oneindiatelugu
— oneindiatelugu (@oneindiatelugu) February 8, 2024
వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి హుందాగా నటించారు. ఇక జగన్‌గా జీవా మెప్పించారు. కొంత వరకు జగన్ హావభావాలను జీవా అనుకరించారనిపిస్తోంది. ఇక యాత్ర మొదటి పార్ట్‌లో వైఎస్ఆర్ పాత్రను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు మహీ వి.రాఘవ్ ..అంతకు మించి అద్భుతంగా జగన్ పాత్రను వెండితెర మీద చూపించాడని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.

దర్శకుడిగా మహి వి రాఘవ సక్సెస్ అయ్యాడు. తాను చెప్పాలనుకున్నది వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు జగన్ ఫ్యాన్స్‌కి యాత్ర 2 ఐ ఫీస్ట్ అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. జగన్ అభిమానులకు గూస్ బంప్స్ కలిగించే సన్నివేశాలు యాత్ర 2లో ఉన్నాయి. అభిమానులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. మొత్తానికి ఎన్నికల ముందు యాత్ర 2 అధికార వైసీపీకి ఫుల్ మైలేజ్ ఇచ్చేలా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications