బిగ్‌ బ్రేకింగ్: యువరాజ్‌సింగ్ బయోపిక్‌లో జూనియర్ ఎన్టీఆర్?

కొన్నాళ్ల నుంచి భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్ర పరిశ్రమల్లో విజయవంతమైన వ్యక్తుల జీవిత చరిత్రలతో రూపొందుతున్న సినిమాలు రావడమే కాదు.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కూడా పొందుతున్నాయి. మన దేశానికి రెండు వరల్డ్ కప్ లు సాధించిపెట్టిన మహేంద్రసింగ్ ధోని బయోపిక్ తో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ జీవిత కథతో సినిమా తెరకెక్కబోతోంది. దీనికి సంబంధించిన ప్రకటన అధికారికంగా కొద్దిసేపటి క్రితమే వచ్చింది.

అన్నీ సినిమాలో చూపించబోతున్నారు
రవి, భూషణ్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. రెండు సంవత్సరాల నుంచి యువరాజ్ సింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలను క్షుణ్నంగా పరిశీలించి కథను, స్క్రిప్ట్ ను తయారుచేశామని చెప్పారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఆల్ రౌండర్ గా నిలవడమే కాకుండా ఇండియాకు ప్రపంచకప్ రావడంలో కూడా కీలక పాత్ర పోషించాడని, ఆ తర్వాత క్యాన్సర్ రావడం, దాన్ని విజయవంతంగా ఎదుర్కోవడంలాంటివన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నట్లు వీరిద్దరూ వెల్లడించారు.

yong tiger junior ntr to act in cricketer Yuvraj Singh s biopic

ఎన్టీఆర్ అయితే న్యాయం చేస్తాడు
ఈ చిత్ర నిర్మాతలు యువరాజ్ సింగ్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉండే తారక్ ను కలిసి దీనిపై చర్చించబోతున్నట్లు సమాచారం. యువరాజ్ లాంటి క్యారెక్టర్ కోసం తారక్ లాంటి హీరో అయితేనే న్యాయం జరుగుతుందనే భావనలో నిర్మాతలు ఉన్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తారక్ ఈ సినిమా చేస్తే రికార్డులు బద్దలవుతాయంటున్నారు. కచ్చితంగా ఈ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకుంటాడని, పాన్ ఇండియా సినిమాగా కాదని, దీన్ని పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయడానికి కూడా ఇందులో స్కోప్ ఉందంటున్నారు. తారక్ నటించిన దేవర చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. వచ్చేనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడం, దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి సినిమా లేకపోవడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+