ఏపీ రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించగా తాజాగా విడుదలైన దేవర సంచలన వసూళ్లు రాబడుతోంది. మూడు రోజులకు రూ.304 కోట్లు వసూలు చేసింది. హిందీలో రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్టోబరు మూడోతేదీ నుంచి 12వ తేదీ వరకు దసరా సెలవులు ఉండటంతోపాటు అక్టోబరు 2 గాంధీ జయంతి కావడంతో కొద్దిరోజులు ఈ సినిమా హవా కొనసాగుతుందని భావిస్తున్నారు. హిందీలో దేవరకు సంబంధించిన ప్రమోషన్లలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటున్నారు.

మొదటి సినిమాకు తన వయసు 17 సంవత్సరాలు
కపిల్ శర్మతో జరిగిన ఇంటర్వ్యూలో తారక్ కు రాజకీయకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మీ కుటుంబంలో నటులతోపాటు రాజకీయ నేతలు కూడా ఉన్నారని, మీకు సినిమాలంటే ఇష్టమా? లేదంటే రాజకీయాలంటే ఇష్టమా? రెండో కెరీర్ ఉందా? అని అడిగారు. దీనికి తారక్ సమాధానమిస్తూ తాను మొదటి సినిమా చేసే సమయానికి వయసు 17 సంవత్సరాలని, మొదటి సినిమాకే నటుడిని అవుదామని అనుకున్నానని, తానెప్పుడూ రెండో ఆప్షన్ గురించి ఆలోచించలేదని చెప్పారు. అప్పటి నుంచి తాను నటనపైనే పూర్తిస్థాయిలో దృష్టిసారించినట్లు చెప్పారు.

young tiger junior ntr sensational comments on politics

అభిమానులు ఓటర్లుగా మారరు
మీకోసం అభిమానులు ఓటర్లుగా మారతారా? అని కపిల్ శర్మ ప్రశ్నించగా దానికి తారక్ సమాధానమిస్తూ మారరని చెప్పారు. అభిమానులు సినిమా చూడటానికి టికెట్లు కొనుగోలు చేసి వస్తారని, వారు ఓటర్లుగా రారన్నారు. తనకోసం లక్షల మంది టికెట్లు కొంటున్నారని, అందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇంతమందిని కలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం వైరల్ గా మారిన ఎన్టీఆర్ వ్యాఖ్యలను విశ్లేషిస్తే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలో లేడని స్పష్టమవుతోందంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసి తిరిగి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు. అప్పటినుంచి తారక్ మళ్లీ రాజకీయాలవైపు చూడలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+