ఈసారి "దునియా సలాం" అనాల్సిందే.. జూనియర్ ఎన్టీఆర్ వీడియో వైరల్ !!

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. "దేవర" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందుకున్నాడు. రీసెంట్ గానే "వార్‌ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీలో హృతిక్ రోషన్‌ హీరోగా నటించగా.. ఎన్టీఆర్ కీలక పాత్రలో మెప్పించారు. కానీ ఆశించిన స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

గత ఏడాదిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మూవీ ప్రారంభం అవ్వగా.. ఈ సినిమాను 2026 చివర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కేజీఎఫ్‌, సలార్‌ సినిమాల కంటే కూడా భారీ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ చిత్రం కోసమే ఎన్టీఆర్ బక్కచిక్కారు.

young-tiger-ntr-gym-work-out-video-goes-viral-on-media

సుమారుగా 18 కేజీల బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ మూవీ టైటిల్ ఇంకా రివీల్ చేయకపోయినా.. ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ మూవీకి డ్రాగన్‌ అనే టైటిల్‌ని ఫిక్స్ అయినట్టు మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసిన విషయం తెలిసిందే.

కాగా లేటెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ పర్సనల్ జిమ్ ట్రైనర్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఆ పోస్టులో దేవర నుంచి వర వరకు.. వర నుంచి విక్రమ్ వరకు.. అలాగే ఇప్పుడు డ్రాగన్ కోసం అంటూ జూనియర్ ఎన్టీఆర్ వర్కౌట్ చేస్తున్న వీడియో షేర్ చేశాడు. ఈ మనిషి తన డెడికేషన్ తో నన్ను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు అంటూ తారక్ గురించి రాసుకొచ్చాడు. ఇక ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ హ్యాండ్ వర్క్ ఔట్స్ చేస్తూ తన కండలతో కనిపిస్తున్నారు. దీంతో నెక్స్ట్ మూవీ హిట్ కొట్టడం పక్కా అంటూ ఆ పోస్టును రీ పోస్ట్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అంతే కాకుండా ఈ మూవీలో మలయాళ సీనియర్ నటులు బిజూ మీనన్.. యంగ్ హీరో టోవినో థామస్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+