ఒక్క ఈవెంట్ తోనే ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరో మేనకోడలు..!
తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ఓ ముద్దుగుమ్మ. ఇంత వరకు ఆమె నటించిన ఒక సినిమా కానీ వెబ్ సిరీస్ రిలీజ్ కాలేదు..కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. X (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా అన్నీ ప్లాట్ ఫామ్ లలో ట్రెండింగ్ గా నిలుస్తుంది. తన గ్లామర్, స్టైలిష్ లుక్స్‌తో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా ? ఆమె జైన్ మేరీ ఖాన్ (Zayn Marie Khan).
డెకాయిట్ మూవీతో ఎంట్రీ..
అడివి శేష్ హీరోగా షానియల్ డియో తెరకెక్కిస్తున్న చిత్రం 'డెకాయిట్'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది. కాగా జైన్ మేరీ ఖాన్.. ఈ సినిమాలో 'జానకి' అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది.

అయితే ఇటీవల జరిగిన మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన్న జైన్.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆమె వేసుకున్న బోల్డ్ డ్రెస్ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది. అంతే కాకుండా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబై, హైదరాబాద్ నగరాల్లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లలో ఆమె హాజరైంది. దీంతో జైన్ మేరీ ఖాన్ ఎవరు ? అని తెగ ఆరా తీస్తున్నారు.
జైన్ మేరీ ఖాన్ ఎవరంటే ???
బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ కజిన్ బ్రదర్, దర్శకుడు మన్సూర్ ఖాన్ కూతురే జైన్ మేరీ ఖాన్. దాంతో జైన్ మేరీ ఖాన్ ఆమీర్ ఖాన్ మేనకోడలు అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం జైన్ వయస్సు సుమారు 31 సంవత్సరాలు. అయితే బాలీవుడ్ లో ఆమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. కపూర్ అండ్ సన్స్ (2016), సీక్రెట్ సూపర్ స్టార్ (2017) వంటి సినిమాలకు పని చేసింది. అలానే 'ఇల్లీగల్' అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
No idea on the movie promotions, but surely she'd be getting more promotions for other movies.
— 𝙰𝙲𝚃𝚁𝙴𝚂𝚂 𝙶𝙻𝙰𝙼𝚂𝙿𝙾𝚃 ✨ (@GlamspotA) April 5, 2026
Zayn Marie Khan is all that's trending. pic.twitter.com/SgotQA8Xb5












Click it and Unblock the Notifications