• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Fact Check: ఉద్యోగాలిస్తామంటున్న ఈ వెబ్‌సైట్‌ను చూసి మోసపోకండి: ప్రభుత్వం

|

సోషల్ మీడియా వేదికగా చాలా పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి చాలామంది ప్రజలు మోసపోయారు. ఉద్యోగాల పేరుతో కొందరు డబ్బులు కూడా వసూలు చేశారు. ఇదంతా సోషల్ మీడియా వేదికగా జరుగుతోన్న మోసమని ప్రజలు గ్రహించలేకున్నారు. ప్రభుత్వాలు పోలీసులు ఇలాంటి తప్పుడు వెబ్‌సైట్లు, మోసపూరితమైన వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నప్పటికీ వాటిని పెడచెవిన పెట్టి చివరకు మోసపోతున్నారు. తాజాగా తాజాగా ఓ వెబ్‌సైట్ కూడా ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటన ఇచ్చింది.

కిసాన్ వికాస్ మిత్ర సమితి అనే వెబ్‌సైట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వెబ్‌సైట్ వ్యవసాయ సహకారం మరియు రైతు సంక్షేమ శాఖ కింద రిజిస్టర్ అయ్యిందంటూ ప్రకటన చేసుకుంది.అయితే ఇలాంటి వెబ్‌సైట్లను నమ్మి మోసపోకూడదని ప్రభుత్వం చెబుతోంది.కిసాన్ వికాస్ మిత్ర సమితి(కేవీఎంఎస్) అనే వెబ్‌సైట్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద నమోదు కాలేదని స్పష్టం చేసింది. ఈ వెబ్‌సైట్ ఫేక్ వెబ్‌సైట్ అని దీన్ని ఎవరూ ఫాలో కావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది.

Fact Check: Kisan Vikas Mitra Samiti job portal is fake, clarifies Govt

ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామంటూ ప్రచారంలో ఉన్న కిసాన్ వికాస్ మిత్ర సమితి అనే వెబ్‌సైట్‌ వాస్తవం కాదని ప్రజలు మోసపోకూడదని ముఖ్యంగా నిరుద్యోగులు ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్ వలలో చిక్కుకోవద్దని పీఐబీ క్లారిటీ ఇచ్చింది.

Fact Check

వాదన

కిసాన్ వికాస్ మిత్ర సమితి అనే వెబ్‌సైట్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద నమోదైంది

వాస్తవం

అలాంటి వెబ్‌సైట్ ఏమీ లేదు

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు factcheck@one.in కు మెయిల్ చేయండి

English summary
A fake webssite by name Kisan Vikas Mitra samiti is making rounds that assures employment opportunites.Govt says its fake and not to fall a prey to this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X