Fact Check: బహదూర్‌పురాలో రిగ్గింగ్ జరిగిందా..వైరల్ వీడియోలో నిజముందా..?

ఎన్నికల వేళ సోషల్ మీడియాలో అవాస్తవమైన పోస్టులు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొందరు తమ స్వంత లాభం కోసం ఇలాంటి పోస్టులు పెట్టి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అలాంటి పోస్టులపై ఈసీ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ముందుగా ఇలాంటి వైరల్ పోస్టులు సోషల్ మీడియాలో దర్శనమిస్తే.. వాటిని మరొకసారి క్రాస్ చెక్ చేసి ఆపై సంబంధిత అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నాకే ఫలానా పోస్టు వాస్తవమా లేక అవాస్తవమా అనేది నిర్ధారిస్తోంది.

తాజాగా ఓ పాత వీడియో ఇప్పుడు ఎన్నికల వేళ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. ముఖ్యంగా వాట్సాప్‌లో చక్కర్లు కొట్టేసింది.అయితే ఈ వీడియో ఎక్కడిది ఎప్పుడిది అనే కోణంలో విచారణ చేయగా ఇది చాలా పాత వీడియోగా నిర్థారించబడింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో పాతదని పేర్కొంటూ అందుకు తగిన రుజువులతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇచ్చింది. అసలు వీడియోలో ఏముంది..?

Fact check rigging in telangana

తెలంగాణ ఎన్నికల్లో రిగ్గింగ్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి పోలింగ్ స్టేషన్‌లో ప్రిసైడింగ్ ఆఫీసర్‌తో పాటుగా ఉన్నట్లుగా ఉంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ సర్జికల్ మాస్క్ ధరించి ఉండగా.. ఆ వ్యక్తి నీలం రంగు టీషర్ట్ ధరించి ఓటు వేసే కంపార్ట్‌మెంట్ దగ్గర నిల్చుని ఉన్నాడు.ఇక ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు ఆ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి బయటకు వస్తున్నారు. ఈ వ్యక్తి అక్కడే నిల్చుని వారికి ఏవో సూచనలు చేస్తున్నట్లుగా వీడియోలో ఉంది. కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిన వ్యక్తి బయటకు రాగానే ఒక బీప్ సౌండ్ వినిపిస్తోంది. అయితే ఈ వీడియో హైదరాబాద్‌లో పార్లమెంట్‌ కిందకు వచ్చే బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలోనిదంటూ ప్రచారం జరుగుతోంది.

అయితే దీనిపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం అసలైన నిజాన్ని వెలికితీసింది. ఈ వీడియో చాలా పాతదని, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ ఎన్నికలకు సంబంధించినది కాదని ఈసీ స్పష్టం చేసింది. అసలు తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికలకు ఈ వీడియో సంబంధం లేదని తేల్చి చెప్పింది. 2022 ఫిబ్రవరి 27వ తేదీన టీవీ9 బంగ్లా యూట్యూబ్ ఛానెల్‌లో పోస్టు చేయడం జరిగిందని ఈసీ వెల్లడించింది. దీంతో ఈ వీడియో అసలు తెలంగాణకు సంబంధించినదే కాదని తేటతెల్లం అవుతోంది.మరోవైపు వీడియోలోని ఆడియోను శ్రద్ధగా విన్నట్లయితే అందులో మాట్లాడుతున్న భాష తెలుగు కాదని ఈసీ పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ చాలా స్వేచ్ఛగా, నిజాయితీతో నిర్వహించామని ఈసీ చెప్పుకొచ్చింది.

జర్నలిస్టులు, సామాన్య పౌరులు ఈ వీడియో గురించి నిజనిజాలు సమాజానికి తెలపాలని ఈసీ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి రిగ్గింగ్‌ జరగలేదని మొత్తం ఎన్నికల ప్రక్రియ చాలా సజావుగా, సహేతుకంగా, పారదర్శకతతో నిర్వహించినట్లు ఈసీ వివరించింది.

Fact Check

వాదన

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బహదూర్‌పురా పోలింగ్ స్టేషన్‌లో రిగ్గింగ్ జరిగింది

వాస్తవం

వైరల్ అవుతోన్న వీడియో టీవీ 9 బంగ్లా యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధం లేదు.

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+