Fact Check: జనసేనలోకి వంగా గీత ..అసలు వాస్తవమేంటి..?

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పోలింగ్‌కు రోజులు దగ్గరపడుతున్న కొద్దీ సోషల్ మీడియా వేదికగా చాలామంది తప్పుడు వార్తలు పోస్టు చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇక ప్రజలు ఈ తప్పుడు పోస్టింగులను నమ్మొద్దంటూ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకించి ఈ ఎన్నికల వేళ తప్పుడు ప్రచారాలు ఎక్కవైపోయాయి. పిఠాపురం నియోజకవర్గం వేదికగా ఈ పోస్టింగులు మరింత ఎక్కవయ్యాయి.

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటం ఒకటైతే.. ఆయనపై మహిళా అభ్యర్థి వంగా గీత పోటీచేస్తుండటం మరొక కారణం. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందని వారే కావడం, అక్కడ కాపులు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారడంతో ఇద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. మరో విషయం ఏంటంటే వంగా గీత లోకల్, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల వారు తప్పుడు పోస్టింగులు చేస్తూ రెచ్చిపోతున్నారు.

Fact Check Vanga geetha to join Janasena

తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్‌గా మారింది. వైసీపీ అభ్యర్థి వంగా గీత నామినేషన్ విత్‌డ్రా చేసుకుని జనసేనలో చేరుతోందంటూ ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ అంశాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత ఆ పోస్టు కేవలం వంగా గీతాను టార్గెట్‌గా చేసుకుని కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారనేది తెలిసింది. అంతేకాదు వంగాగీతనే స్వయంగా ఈ పోస్టు గురించి తన ఫేస్‌బుక్ పేజ్ ద్వారా స్పందించారు. ఈ పోస్టును ఖండిస్తూ ఆమె ఫేస్‌బుక్‌లో ఇది ఒక తప్పుడు ప్రచారం అని చెప్పుకొచ్చారు.

అయితే ఇలాంటి ఫేక్ పోస్టుల వల్ల ప్రజలు జాగ్రత్తగా ముఖ్యంగా ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వంలోని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ఫేక్ పోస్టింగులపై గట్టి నిఘా పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ప్రస్తావన కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వైసీపీ యత్నిస్తుండగా... పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే పిఠాపురం రూపురేఖలు మార్చేస్తారని జనసేన చెప్పుకొస్తోంది.

Fact Check

వాదన

జనసేనలోకి పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత

వాస్తవం

వంగా గీత తాను జనసేనలోకి వెళ్లడం లేదని ఈ వార్త పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు.

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+