Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fact Check:హైదరాబాదులో రాత్రి 10:30 గంటలకు దుకాణాలు బంద్..?

Fact Check: సోషల్ మీడియాతో మంచి ఎంతైతే ఉందో చెడు కూడా అంతే సమానంగా ఉంది. మంచి కంటే చెడు వేగంగా సోషల్ మీడియాలో విస్తరిస్తోంది. ఏదైనా ఒక ఘటనకు సంబంధించి ఒక పోస్టు పెడితే చాలు అది వైరల్‌గా మారుతోంది. దీంతో సామాన్య ప్రజలు అదే నిజమని భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ తప్పుడు ప్రచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇలాంటి వార్తే ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇంతకీ ఆ వార్తేంటి.. దానిపై అధికారులు ఎలాంటి క్లారిటీ ఇచ్చారు..?

రాత్రి 10:30 గంటలకు షాపులు బంద్

హైదరాబాదులో అన్ని దుకాణాలను లేదా షాపింగ్ సెంటర్లను రాత్రి 10:30 గంటలు లేదా 11 గంటలకు మూసివేస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ప్రజలు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో హైదరాబాద్ పోలీస్ శాఖ రంగంలోకి దిగి ప్రచారంలో ఉన్న ఈ వార్తపై క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఖండించిన హైదరాబాద్ సిటీ పోలీస్... అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది. ఇదివరకటిలానే అమలులో ఉన్న నిబంధనల ప్రకారమే షాపులు ఇతర దుకాణాలు తెరిచి ఉంటాయని పోలీసులు స్పష్టతను ఇచ్చారు.

Fact Check Shops and establishments in Hyderabad to be shut by 10 30 pm Police clarifies

పొరబడిన ఎంపీ అసదుద్దీన్

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తను చూసి హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా పొరబడ్డారు. హైదరాబాదులో అర్థరాత్రి 12 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో షాపింగ్ సెంటర్లు రాత్రంతా తెరిచే ఉంటాయని చెప్పుకొచ్చారు.రాత్రి వేళల్లో ఇరానీ ఛాయ్ హోటల్లు, పాన్ షాప్‌లు ఇతర వాణిజ్యపరమైన దుకాణాలు తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలంటూ ఎక్స్‌ పై పోస్టు చేశారు. ఈ పోస్టులో తెలంగాణ డీజీపీని, హైదరాబాద్ సీపీని ట్యాగ్ చేశారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామంటూ చెప్పుకొచ్చారు ఓవైసీ.

మొత్తానికి హైదరాబాదు నగరంలో రాత్రి 10 గంటలు లేదా 11 గంటలకు దుకాణాలు బంద్ చేస్తున్నారన్న వార్త నగర ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ఇక స్వయంగా పోలీసు శాఖే ఆ వార్తలో నిజం లేదని స్పష్టత ఇవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Fact Check

వాదన

హైదరాబాదులో రాత్రి 10:30 గంటలకు దుకాణాలు బంద్

వాస్తవం

రాత్రి 10:30 గంటలకు దుకాణాలు బంద్ అన్న వార్తలో నిజం లేదని తేల్చేసిన హైదరాబాద్ పోలీస్ శాఖ

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+