ఫ్రీజోన్ మాయాజాలం

1976, 1985, 1989, 1991, 1995, 1996, 1998ల్లో సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్ఐ) ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. హైదరాబాద్ ను ఫ్రీజోనుగా పరిగణిస్తూ ఈ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించడానికే కొత్తగా ఈ ఫ్రీజోన్ ను తెర మీదికి తెచ్చారు. దాని వల్ల హైదరాబాద్ జిల్లా స్థానికులకు తీవ్రంగా అన్యాయం జరిగింది. హైదరాబాదు జిల్లాలో పుట్టి పెరిగినవారు ఎక్కడా స్థానికులు కాకుండా పోయారు. హైదరాబాదును ఫ్రీజోన్ గా పరిగణించడం వల్ల జిల్లా క్యాడర్, జోనల్ నాన్ గజిటెడ్, జోనల్ గజిటెడ్ పోస్టుల్లో ఇతర జిల్లాల్లోని స్థానికులకు దక్కుతున్నట్లుగా హైదరాబాద్ జిల్లా స్థానికులకు వరుసగా 80, 70, 60 శాతం కోటా దక్కాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలను హైదరాబాద్ జిల్లా స్థానికులు ఫ్రీజోన్ మాయ వల్ల పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రకంగా 1976 నుంచి 1999 వరకు జరిగిన పోలీసు నియామకాల్లో హైదరాబాద్ జిల్లా స్థానికులు 199 ఉద్యోగాలు కోల్పోయారు. ఇది ఒక లా అండ్ ఆర్డర్ కు సంబంధించిన వ్యవహారం మాత్రమే. ఇంటిలిజెన్స్, సిఐడి, పిటివో, కమ్యూనికేషన్స్, ఎపిఎస్ఎఫ్ఎల్, స్పెషల్ బెటాలియన్స్ లో కూడా ఇదే వ్యవహారం నడుస్తూ వస్తోంది.
ఈ నియామకాల చట్టబద్ధతను కోర్టులో ప్రశ్నించినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి గమ్మత్తయిన వాదనను ముందుకు తెచ్చారు. హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం అంటే హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం 1348ఎఫ్ లోని 3(బి) సెక్షన్ ను అడ్డం పెట్టుకున్నారు. నిజానికి ఈ సెక్షన్ నిజాం ప్రభుత్వ హయాంలోనిది. నిజాం ప్రభుత్వం నాటి ముల్కీ నిబంధనలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు భారత ప్రభుత్వం పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా చట్టబద్దత కల్పించింది. సుప్రీంకోర్టు కూడా దాని అమలు రాజ్యాంగబద్దమేనని సమర్థించింది. సుప్రీంకోర్టు సమర్థించిన ముల్కీ నిబంధనలను వ్యతిరేకించిన ఆంధ్ర వలస పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం నిజాం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మాత్రం పోలీసు నియామకాల్లో స్థానికులకు అన్యాయం చేసేందుకు ఒడిగట్టారు. పాత చట్టాలు, నిబంధనలు తమ అనుకూలమైతే వాటిని సమర్దించడం, ప్రతికూలమైతే కాలం చెల్లినవని, పురాతనమైనవని కొట్టిపారేయడం అనే వితండవాదాన్ని ప్రయోగిస్తూ వస్తున్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వులలోని పారా 11 ప్రకారం ఉద్యోగ నియామకాలకు సంబంధించి 1975కు ముందున్న నిబంధనలన్నీ రద్దవుతాయి. దీన్ని తమ కోసం కావాలని పక్కన పెట్టి పాత నిబంధనలను తెర మీదికి తెచ్చి తమ అక్రమ విధానాలను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్సలు వినిపిస్తున్నాయి. హైదరాబాదును ప్రీజోన్ గా పరిగణిస్తూ నిజాం కాలం నాటి చట్టాన్ని అడ్డం పెట్టుకుని నియామకాలు జరిపినవారే వారి సర్వీసులను మాత్రం రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోని ఎపి స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్, ఎపి పోలీసు సబార్డినేట్ సర్వీసు రూల్స్ కిందికి తెచ్చారు. ఈ డొంక తిరుగుడు విధానం ద్వారా ఉద్యోగాల్లోనే కాకుండా ప్రమోషన్లలో కూడా స్థానికులకు అన్యాయం చేస్తూ వచ్చారు.
హైదరాబాద్ ఫ్రీజోన్ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్ల, పక్షపాత వైఖరి వల్లనే సమస్యగా మారిందనే అభిప్రాయం ఉంది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫు న్యాయవాదికి ప్రభుత్వం వాదనకు అవసరమైన సామగ్రిని అందజేయలేదనే విమర్శ కూడా ఉంది. కావాలనే ప్రభుత్వం స్థానికులకు న్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తోందనే విమర్సలు ఉన్నాయి.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications