పూటకో మగాన్ని మార్చుతున్న తారలు

John Abraham-Bipasha Basu
పూటకో డ్రెస్ మార్చినట్లు...రోజుకో మొబైల్ మార్చినట్లు...ప్రేమికులను మార్చేస్తున్నారు సినిమా హీరోయిన్లు. ఈ విషయంలో నార్త్, సౌత్ అనే తేడా మాత్రం ఎంతమాత్రం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ విషయానికి వస్తే...తొలుత సల్మాన్ తో ఘాటు ప్రేమాయణం సాగించింది. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో సల్మాన్ ను వదిలేసి వివేక్ ఒబెరాయ్‌తో కొంతకాలం డేటింగ్ చేసింది. చివరకు అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుని సెటిలయింది. ఐష్ చేసిన గాయం మానక సల్మాన్ ఇప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటే వివేక్ ఒబెరాయ్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

కరీనా ‌కపూర్ తొలుత షాహిద్ కపూర్‌ను లవ్వాడి హద్దులు కూడా దాటింది. ఆ మధ్య వీళ్ల కిస్సింగు సీన్లు సంచలనం సృష్టించాయి. మరి షాహిద్ అంటే బోర్ కొట్టిందో..ఏమోగానీ షాహిద్ ను వదిలి సైఫ్ అలీఖాన్‌ను తగులుకుంది. తన భార్యను కాదని కరీనాతో సహజీవనం చేస్తున్నాడు సైఫ్. దీంతో షాహిద్ కపూర్ ప్రియాంక చోప్రాతో జతకట్టాడు. అయితే ప్రియాంక చాలా మందితో ఎఫైర్లు నడుపుతూ తనను నిర్లక్ష్యం చేస్తుండటంతో మరోసారి మనసు గాయపడి తనతో జతకట్టే అమ్మాయిల కోసం పడిగాపులు కాస్తున్నాడు. దీపిక పదుకొనె, రణబీర్ కపూర్ ప్రేమాయణం గురించి ఎంత చెప్పినా తక్కువే. రణబీర్ తో తెగదెంపులు చేసుకున్న దీపిక ప్రస్తుతం లిక్కర్ కింగ్ విజయ్ మాల్యకొడుకు సిద్దార్థ మాల్యాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది.

పదేళ్లుగా కలిసి సహజీవనం చేస్తూ అన్నిసుఖాలను అనుభవిస్తున్న బిపాస-జాన్ అబ్రహాం ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. ఏమైందని బిపాసను అడిగితే ఎప్పడూ కలిసే ఉండాలని రూలేమీలేదు కదా...అంటూ గడుసుగా సమాధానం ఇస్తోంది. సౌత్ విషయాని కొస్తే నయనతార తొలుత శింబుతో బాగా లోతైన ప్రేమాయణం సాగించి అతన్ని వదిలి ప్రభుదేవాతో సెటిలయింది. వీళ్ల బాటలోనే చాలా మంది హీరోయిన్లు తప్పుడు దారి పడుతున్నారు. వీళ్లంతా విచ్చలవిడి తనంతో భారతీయ సంప్రదాయం పరువు తీస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+