అజర్ తనయుడితో జ్వాలా గుత్తా?

హైదరాబాదులో జ్వాలా ఆడే ప్రతి మ్యాచుకూ అసద్ వస్తున్నాడని, ఆమె ఆటను ఆసక్తితో చూస్తున్నాడని, ప్రతి గేమ్ తర్వాతా జ్వాలా వెళ్లి అతని పక్కనే కూర్చుంటోందని, వారిద్దరూ ముచ్చట్లలో మునిగిపోతూ కనిపిస్తున్నారని, ఇద్దరూ కలిసి వస్తూ కలిసి వెళ్తున్నారని చూసినవారు చెబుతున్నారు. ఐపియల్ మ్యాచు తర్వాత జరిగిన పార్టీలో కూడా ఆమె అసద్‌తో కలిసి కనిపించిందట. అది గమనించి ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ఒకతను తన కెమెరాను క్లిక్ అనిపించాడు.
అజరుద్దీన్, తానూ మిత్రులమని జ్వాలా ఎప్పుడూ చెబుతారు. అజర్ కుటుంబంతో జ్వాలాకు చాలా కాలంగా సాన్నిహిత్యం ఉంది. అసదుద్దీన్‌కు జ్వాలా చాలా కాలంగా తెలుసు. అసద్ ఇప్పుడిప్పుడే ఆటలో పైకి వస్తున్నాడు. మరో రెండేళ్లలో అసద్ మంచి ఆటగాడిగా ఎదుగుతాడని అంటున్నారు. ఈ స్థితిలో జ్వాలా అలా అతన్ని వెంటేసుకుని తిరగడం సరి కాదని చెబుతున్నారు. అజరుద్దీన్‌తో కలిసి జ్వాలా తిరగడం మామూలేనని, అప్పుడప్పుడు అసదుద్దీన్‌తో కూడా కనిపించేదని అంటున్నారు. భర్త చేతన్ ఆనంద్‌తో జ్వాలా గత రెండేళ్లుగా విడిగా ఉంటున్నారు.
సంగీతా బిజలానీకి అజర్ దూరమవుతున్నాడని, జ్వాలాతో కలిసి ఉండాలని అనుకుంటున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో చేతన్ ఆనంద్ కలత చెంది జ్వాలాకు దూరమయ్యాడు. ఏమైనా, అప్పటి ప్రచారం రెండు జంటల మధ్య చిచ్చు పెట్టింది.












Click it and Unblock the Notifications