చిత్రం కాదు: ప్రియురాలితో భర్తకు పెళ్లి చేసిన భార్య!

తూర్పుగోదావరి: ఓ యువతితో 8ఏళ్లుగా ఓ యువకుడు ప్రేమాయణం సాగిస్తున్నాడు. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కాగా, వాస్తవం గ్రహించిన అతడి భార్య పెద్ద మనసు చేసుకుని.. అతడి ప్రియురాలితో దగ్గరుండి భర్త వివాహం జరిపించింది. ఇదేమీ

సినిమాను తలపించేలా జరిగిన ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని రాజవొమ్మంగి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రాజవొమ్మంగి గ్రామానికి చెందిన భూముల అప్పారావుకు, అదే గ్రామానికి చెందిన ఓ యువతితో పెద్దలు స్థానిక శ్రీకోదండ రాముల వారి ఆలయంలో వివాహం జరిపించారు.

A woman did her husband's marriage with his girlfriend

అప్పారావు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. కాగా, అప్పారావు, అతడు ప్రేమించిన భాను వ్యవహారం తెలిసిన అతడి భార్య వారి వివాహానికి అంగీకరించింది.

అంతేగాక, వారి పెళ్లిని పెద్దల సమక్షంలో దగ్గరుండి జరిపించింది. ముగ్గురు ఇష్టపడటంతోనే ఈ పెళ్లి జరిపించామని స్థానిక పెద్దలు తెలిపారు. ప్రేయసిని పెళ్లాడేందుకు భార్యే ఒప్పుకోవడంతో ఆ యువకుడు ప్రియురాలి మెడలో ఆనందంగా తాళి కట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+