వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపా కర్మాకర్: రియో నుంచి పరీక్ష హాలుకు!(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

అగర్తలా: రియో ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్‌ విభాగంలో అద్భుతమైన ప్రతిభ చాటి తృటిలో పతకం చేజార్చుకున్న దీపా కర్మాకర్‌కు సొంత రాష్ట్రంలో ఘన స్వాగతం లభించింది. దేశానికి పతకం తెచ్చేందుకు ఆమె పడిన తపనకు దేశం గర్వపడింది. ఒలింపిక్స్‌లో పతకం గెలవకపోయినా.. దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్న ఆమెను త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది.

కాగా, దీప తన ఆటకు ఎంత ప్రాధాన్యమిస్తుందో చదువుకు కూడా అంతే విలువిస్తుందని తెలుస్తోంది. రియో నుంచి వచ్చిన మరుసటి రోజే దీప తన ఎంఏ పరీక్షలకు హాజవడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. రియో మహిళ రెజ్లింగ్‌లో నాల్గో స్థానం సాధించిన దీపా కర్మాకర్‌ సోమవారం భారత్‌కు చేరుకుంది.

త్రిపుర యూనివర్శిటీలో దూరవిద్యలో ఎంఏ చేస్తున్న దీపకు మంగళవారం నుంచి రెండో సెమీస్టర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో రియో నుంచి వచ్చిన మర్నాడే.. దీప పరీక్షకు హాజరైంది. పరీక్ష హాలులో దీపను చూసిన అధ్యాపకులు, అధికారులు చదువు పట్ల ఆమెకున్న శ్రద్ధకు ముచ్చటపడ్డారు.

దీపా కర్మాకర్

దీపా కర్మాకర్

రియో ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్‌ విభాగంలో అద్భుతమైన ప్రతిభ చాటి తృటిలో పతకం చేజార్చుకున్న దీపా కర్మాకర్‌కు సొంత రాష్ట్రంలో ఘన స్వాగతం లభించింది.

దీపా కర్మాకర్

దీపా కర్మాకర్

దేశానికి పతకం తెచ్చేందుకు ఆమె పడిన తపనకు దేశం గర్వపడింది. ఒలింపిక్స్‌లో పతకం గెలవకపోయినా.. దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్న ఆమెను త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది.

దీపా కర్మాకర్

దీపా కర్మాకర్

కాగా, దీప తన ఆటకు ఎంత ప్రాధాన్యమిస్తుందో చదువుకు కూడా అంతే విలువిస్తుందని తెలుస్తోంది. రియో నుంచి వచ్చిన మరుసటి రోజే దీప తన ఎంఏ పరీక్షలకు హాజవడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. రియో మహిళ రెజ్లింగ్‌లో నాల్గో స్థానం సాధించిన దీపా కర్మాకర్‌ సోమవారం భారత్‌కు చేరుకుంది.

దీపా కర్మాకర్

దీపా కర్మాకర్

త్రిపుర యూనివర్శిటీలో దూరవిద్యలో ఎంఏ చేస్తున్న దీపకు మంగళవారం నుంచి రెండో సెమీస్టర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో రియో నుంచి వచ్చిన మర్నాడే.. దీప పరీక్షకు హాజరైంది.

దీపా కర్మాకర్

దీపా కర్మాకర్

పరీక్ష హాలులో దీపను చూసిన అధ్యాపకులు, అధికారులు చదువు పట్ల ఆమెకున్న శ్రద్ధకు ముచ్చటపడ్డారు.

దీపా కర్మాకర్

దీపా కర్మాకర్

పరీక్షలను ఎలా తప్పించుకోవాలా? అని కారణాలు వెతికే విద్యార్థులు చాలా మంది ఉంటారని, అయితే దీప మాత్రం అలా చేయలేదని త్రిపుర యూనివర్శిటీ దూరవిద్య డైరెక్టర్‌ జమతియా అన్నారు.

దీపా కర్మాకర్

దీపా కర్మాకర్

ఆటలతో పాటు చదువుకు కూడా ప్రాధాన్యమిస్తున్న దీప.. అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దీనిపై దీప కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. జిమ్నాస్టిక్‌ శిక్షణ తీసుకుంటున్నా కూడా చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని.. రియోకు వెళ్లేప్పుడు పుస్తకాలను వెంట తీసుకెళ్లిందని చెప్పారు.

English summary
Dipa Karmakar, India's star gymnast and fourth-place finisher at Rio Olympics, is not only aspiring to be a gold medallist at 2020 Tokyo Games but also hopes to hold a Master of Arts degree soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X