సిబిల్ స్కోర్ తక్కువున్నా ఇలా లోన్ పొందొచ్చు!

బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ ద్వారా, బంగారు ఆభరణాలపై లోన్ పొందొచ్చు. కాకపోతే వీటికి 2 శాతం అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

Loan:క్రెడిట్ స్కోర్ తక్కువుండటంతో లోన్ రాదని బాధపడుతున్నారా? అయినా రుణాన్ని సులువుగా పొందొచ్చు. బ్యాంకులతోపాటు రుణాలందించే ఇతర ఆర్థిక సంస్థలన్నీ ముందుగా క్రెడిట్ స్కోర్ చూస్తాయి. సిబిల్ స్కోర్ ఎక్కువ ఉన్నవారికే రుణాలు మంజూరు చేస్తుంటాయి. అదే తక్కువుంటే మాత్రం రుణం పొందడం కష్టమని చెప్పవచ్చు. అయినా క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నప్పటికీ రుణం పొందడానికి 5 మార్గాలున్నాయి. అవేంటంటే..

Credit Score:బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయవచ్చు. ఆ ఎఫ్ డీపై మళ్లీ లోన్ తీసుకోవచ్చు. ఈ తరహా రుణాలకు క్రెడిట్ స్కోరు తక్కువున్నప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా రుణం మంజూరవుతుంది. డిపాజిట్ చేసిన మొత్తంలో 90 నుంచి 95 శాతం వరకు లోన్ రూపంలో పొందవచ్చు. అయితే ఫిక్స్ డ్ డిపాజిట్ పై తీసుకునే రుణాలకు రెండు శాతం వడ్డీ ఎక్కువగా ఉంటుంది.

how can get urgent loan with fixed deposits and gold jewellery

కొన్ని ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు వినియోగదారులకు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ రుణాలు మంజూరు చేస్తుంటాయి. ఇలా ఎన్‌బీఎఫ్‌సీల దగ్గరి నుంచి కూడా రుణం పొందొచ్చు. అయితే వీటిల్లో బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.డబ్బుతో అవసరం ఉంటే బంగారు ఆభరణాలపై లోన్ తీసుకోవచ్చు. వీటికి క్రెడిట్ స్కోర్ తో పనివుండదు. మీదగ్గర బంగారం ఉంటేచాలు.. లోన్ పొందొచ్చు. మీరు కుదువ పెట్టే ఆభరణాల విలువలో 75 శాతాన్ని లోన్ గా మంజూరు చేస్తారు.

how can get urgent loan with fixed deposits and gold jewellery

ఉద్యోగులు వారు పనిచేసే కంపెనీలో అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లిస్తే సరిపోతుంది. ఇలా కూడా లోన్ పొందొచ్చు. క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 వరకు ఉంటుంది. సిబిల్ స్కోర్ 750 లేదా ఆపైన ఉంటే మంచి స్కోర్ అని చెబుతారు. దీనివల్ల మీ స్కోర్‌ను 750కి తగ్గకుండా చూసుకోండి. రీపేమెంట్ కరెక్ట్‌గా ఉంటే.. సిబిల్ స్కోర్ బాగుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+