కార్గిల్ విజయ్ దివస్: శిరస్సు వంచి.. ప్రధాని మోడీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: విజయ్ దివస్ సందర్భంగా అమర్ జవాన్ జ్యోతి వద్ద పలువురు ప్రముఖులు మంగళవారం నాడు నివాళులు అర్పించారు.

కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన అమర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తదితరులు నివాళులు అర్పించారు.

కార్గిల్ అమరవీరులను దేశం ఎప్పటికీ మర్చిపోదని ప్రధాని మోడీ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతీ ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వారి త్యాగాలు మనకు స్ఫూర్తి కావాలన్నారు.

 విజయ్ దివస్

విజయ్ దివస్

1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో సైనికుల ధైర్య సాహసాలను ఈ సందర్భంగా ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు.

విజయ్ దివస్

విజయ్ దివస్

వారి ధైర్యసాహసాలను దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. బీజేపీ అగ్రనేత వాజ్‌పేయి నేతృత్వంలోని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కార్గిల్ యుద్ధం సందర్భంగా వాజ్ పేయి వ్యవహరించిన తీరును కొనియాడారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

కార్గిల్ అమరవీరులను దేశం ఎప్పటికీ మర్చిపోదని ప్రధాని మోడీ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతీ ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు చెప్పారు.

మనోహర్ పారికర్

మనోహర్ పారికర్

రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కార్గిల్ అమరవీరులకు నివాళలు అర్పించి, వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. పారికర్‌తో పాటు త్రివిధ దళాల అధిపతులు అమరవీరులకు నివాళులర్పించారు.

విజయ్ దివస్

విజయ్ దివస్

కార్గిల్ అమరవీరులకు యావత్ భారత్ నివాళులు అర్పిస్తోంది. 1999లో కార్గిల్ వార్‌ను విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నాం. ఇది 17వ కార్గిల్ దివస్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nation paid rich tributes to the martyrs of the 1999 Kargil War with Pakistan on Kargil Vijay Diwas today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి