'మాస్క్ మీ టూ': పవిత్ర స్థలంలోనూ ఆమె పిరుదుల్ని తాకి వేధింపులు, ఒక్కటవుతున్న ముస్లిం వనిత..

Subscribe to Oneindia Telugu
  పవిత్ర స్థలంలోనూ 'పిరుదుల్ని' తాకి వేధింపులు

  రియాద్: ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు 'మీ టూ' ఉద్యమంలో భాగంగా గొంతెత్తున్నారు. ఇన్నాళ్లు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మౌనంగా భరించిన మహిళలు.. 'మీ టూ' ద్వారా గొంతు విప్పే క్షణం వచ్చిందని భావిస్తున్నారు.

  ఇప్పటిదాకా సినీ రంగానికి చెందిన హీరోయిన్లు, మోడల్స్ మాత్రమే ఇందులో ఎక్కువగా పాల్గొంటూ వస్తుండగా.. తాజాగా ముస్లిం వనితలు కూడా ఇందులో భాగస్వాములవడం గమనార్హం. తమ బురఖాల మాటున దాగున్న కన్నీళ్లను ప్రపంచానికి తెలిసేలా.. 'మాస్క్ మీ టూ' ద్వారా ఇప్పుడు వారు గొంతెత్తుతున్నారు.

  ఈజిప్ట్ ముస్లిం మహిళ ట్వీట్:

  పని ప్రదేశాల్లోనే కాదు.. ఆఖరికి పవిత్ర మక్కా స్థలంలోనూ లైంగిక వేధింపులు తప్పడం లేదంటూ.. మోనా ఎల్‌తహావి అనే ఈజిప్టియన్‌-అమెరికన్‌ జర్నలిస్ట్‌ చేసిన ట్వీట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

  'మాస్క్‌ మీ టూ' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె ఈ ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ పై అనేకమంది ముస్లిం మహిళలు ప్రతిస్పందించారు. తాము హజ్‌ యాత్రకు వెళ్లినప్పుడు.. అక్కడి రద్దీలో కొంతమంది పురుషులు కావాలని అసభ్యంగా తాకారని, ఎక్కడెక్కడో తడిమారని కొంతమంది బాధిత మహిళలు ట్వీట్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

  పిరుదుల్ని తాకేందుకు ప్రయత్నించారు..:

  పిరుదుల్ని తాకేందుకు ప్రయత్నించారు..:


  పాకిస్థాన్‌కు చెందిన సబికా ఖాన్‌ మోనా ఎల్‌తహావి ట్వీట్‌పై స్పందిస్తూ.. పవిత్ర ప్రార్థనాలయాల్లోనూ మహిళలకు భద్రత కరువైందని చెప్పారు. 'పవిత్ర మక్కా మసీదులో ఉండే 'కాబా' దగ్గర 'తవాఫ్' సమర్పిస్తుండగా.. ఎవరెవరో ఎక్కడెక్కడో తాకుతున్నారు. కొంతమంది గట్టిగా లాక్కుని నా పిరుదుల్ని తాకేందుకు ప్రయత్నించారు. ప్రార్థనా మందిరాల్లోనూ రక్షణ లేకుండా పోయిందా? అని ఏడ్చాను' అని 'మీ టూ' హాష్ ట్యాగ్‌తో సబికా ఫేస్‌బుక్‌లో తెలిపారు.

  వైరల్ పోస్ట్..:

  వైరల్ పోస్ట్..:

  సబికా చేసిన ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టు వేలాదిమందిని కదిలించింది. సోషల్ మీడియాలో దాదాపు 2వేల మంది దీన్ని షేర్ చేశారు. సబికా పోస్టుపై స్పందిస్తూ.. సౌదీ ప్రభుత్వానికి ఇవేమి కనిపించట్లేదా? అని పాకిస్తాన్ కు చెందిన 37ఏళ్ల అజీజా ప్రశ్నించారు. మక్కా యాత్రలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.

  'మాస్క్ మీ టూ..':

  తనతో పాటు తన అక్క కూడా మక్కా యాత్రలో లైంగిక వేధింపులకు గురైందని, సౌదీ ప్రభుత్వం ఇప్పటికైనా అక్కడ మహిళలకు భద్రత కల్పించాలని అజీజా కోరారు. ప్రార్థనాలయాల్లో లైంగిక వేధింపులను నిరసిస్తూ మొదలైన 'మాస్క్ మీ టూ' క్యాంపెయిన్ ఇప్పుడు ఇరాన్, ఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌, సౌదీల్లోనూ మారుమోగుతోంది.

  ఇరాన్ లోనూ ఉధృతంగా..:

  యుక్త వయసులోకి అడుగుపెట్టిన ప్రతీ ఇరాన్ యువతి బుర్ఖా ధరించడం అక్కడ తప్పనిసరి. అయితే బుర్ఖా ధరించినా తమ పట్ల జరుగుతున్న లైంగిక వేధింపులు ఏమాత్రం ఆగట్లేదని అక్కడి చాలామంది మహిళలు ఆరోపిస్తున్నారు.

  ఈ నేపథ్యంలోనే గతేడాది డిసెంబర్ నెలలో విదా మెహవెద్(31) అనే ఒక మహిళ టెహ్రాన్ లోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఎంగెలాబ్ స్ట్రీట్ నడిమధ్యలో బుర్ఖా లేకుండా నిలబడి.. చేతిలో ఒక తెల్లజెండా పట్టుకుని ఊపుతూ తన నిరసన తెలియజేసింది.

  బుర్ఖాను సవాల్ చేస్తూ..


  'ద గాళ్స్‌ ఆఫ్‌ రివల్యూషన్‌ స్ట్రీట్‌' ఇప్పుడు ఇరాన్‌లో ఊపందుకుంది. చాలామంది మహిళలు 'బురఖా ఆంక్ష కాదు. అది మీకు రక్ష' అన్న ఇరాన్ విశ్వాస్వాలను సవాల్ చేస్తున్నారు. కూడళ్లలో బుర్ఖా లేకుండా నిలబడి ' మాస్క్ మీ టూ'కి మద్దతు పలుకుతున్నారు. దీంతో పలువురు మహిళలను అక్కడి పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. కొంతమంది పురుషులు సైతం మహిళలు చేస్తున్న ఈ ఉద్యమానికి మద్దతుగా కూడళ్లలో తెల్ల వస్త్రాలను చూపుతూ నిరసన తెలుపుతున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Muslim women are using #MosqueMeToo to share their experiences of sexual harassment during the Hajj pilgrimage and other religious settings.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి