రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోదావరి పుష్కరాలు: చరిత్రలో పెను విషాదాలు ఇవీ...!

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందారు. దేశంలో ఇలాంటి తొక్కిసలాటలతో జరిగిన పెను విషాదాలు కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల 1954 నుండి 1,700 మందికి పైగా మృత్యువాత పడ్డారు.

1954లో జరిగిన మహా కుంభమేలాకు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు వచ్చారు. అదే సమయంలో అక్కడికి ప్రముఖులు తాకిడి పెరిగింది. భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 800 మంది మృతి చెందారు.

ఆ తర్వాత అతిపెద్ద మహారాష్ట్ర సతారాలో జరిగింది. వాలి వద్ద మంద్రా దేవి ఆలయం ఉంది. 2005 జనవరి 25 పౌర్ణమి రోజు అక్కడి అమ్మవారి యాత్రకు 3 లక్షల భక్తులు వచ్చారు. అమ్మవారికి సమర్పించే కొబ్బరికాయలు, పండ్లు మెట్లపై పడటంతో భక్తులు జారిపడ్డారు. అదే సమయంలో దుకాణాల్లోని సిలిండర్లు పేలాయి. దీంతో 300 మందికి పైగా మృతి చెందారు.

stampede at godavari pushkaralu in ap: Over 1,700 people have been killed during similar incidents

విషాద సంఘటనలు

1954 ఫిబ్రవరి 3 - అలహాబాద్, మహా కుంభమేళా - 800 మంది మృతి
2005 జనవరి 25 - మహారాష్ట్ర, సతారా - 300 మందికి పైగా
2008 సెప్టెంబర్ 30 - రాజస్థాన్, చాముండీ ఆలయం - 249
2008 ఆగస్టు 3 - హిమాచల్ ప్రదేశ్, నైనాదేవి - 162
2013 ఆక్టోబర్ 14 - మధ్యప్రదేశ్, నవరాత్రి ఉత్సవాలు - 115
2011 జనవరి 14 - శబరిమల - 106
2010 మార్చి 4 - ఉత్తర ప్రదేశ్, రాంజానకీ ఆలయం - 63
1992 ఫిబ్రవరి 18 - తమిళనాడు, కుంభకోణం - 60
1996 జూలై 15 - మధ్యప్రదేశ్, ఉజ్జయిని - 60
199 జనవరి 14 - శబరిమల - 53
1986 ఏప్రిల్ 14 - హరిద్వార్ - 46
1981 డిసెంబర్ 4 - కుతుబ్ మినార్ - 41
2003 ఆగస్టు 27 - నాసిక్ కుంభమేళా - 29
2013 ఫిబ్రవరి 12 - అలహాబాద్, మహా కుంభమేళా - 37
1996 సెప్టెంబర్ 18 - కోల్‌కతా - 35
2014 అక్టోబర్ 3 - పాట్నా 33
1986 నవంబర్ 9 - అయోధ్య - 32
2015 జూలై 14 - రాజమండ్రి, ఏపీ, గోదావరి పుష్కరాలు - 27

stampede at godavari pushkaralu in ap: Over 1,700 people have been killed during similar incidents

2014 ముంబైలో 18, ఆగస్టులో భోపాల్లో 18 మంది, 2011లో హరిద్వార్‌లో 16, 2007లో గుజరాత్ మహంకాళీ ఆలయంలో 12 మంది చనిపోయారు.ఆగస్టు 27, 2004లో కృష్ణా పుష్కరాల సమయంలో ఐదుగురు మృతి చెందారు.

English summary
stampede at godavari pushkaralu in ap: Over 1,700 people have been killed during similar incidents
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X