ఆడపిల్లకు జన్మనిచ్చిందని కోడలికి హోండా సిటీ కారు గిఫ్ట్ ఇచ్చిన అత్త
హైదరాబాద్: ఆడ పిల్లకు జన్మను ఇచ్చినందుకు తన కోడలికి ఓ అత్త హోండా సిటీ కారును బహుమతిగా ఇచ్చింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. హమిర్‌పుర్ జిల్లాలో కుష్భూ అనే ఓ వివాహిత ఆడపిల్లకు జన్మనిచ్చింది.
ఆమెకు ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులంతా ఆనందించారు. ఇక, కుష్బూ అత్త ప్రేమాదేవి ఆనందానికి అయితే అంతే లేకుండా పోయింది. ఆమె ఆ సంతోషంలో బంధుమిత్రులను ఇంటికి పిలిచి పెద్ద పార్టీ కూడా చేసింది.

ఆరోగ్య శాఖలో పని చేసి రిటైరయ్యారు. శిశువు రాకతో తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఆమె చెబుతోంది. తమకింత సంతోషం పంచిన కోడలికి హోండా సిటీ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపింది. మగపిల్లల కంటే ఆడపిల్లలే వంద రెట్లు చాలా మేలు అని చెబుతోంది.












Click it and Unblock the Notifications