బస్సులో ప్రియురాలితో యువీ ఎంజాయ్ (వీడియో)

బెంగళూరు: ఐపీఎల్ 9 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన గెలిచి, ట్రోఫీ దక్కించుకున్న అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు తన ప్రియురాలు హజల్ కీచ్‌తో కలిపి సంబరాలు జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

బెంగళూరుతో జరిగిన ఫైనల్ మ్యాచులో యువరాజ్ రాణించాడు. అతను 23 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఫీల్డింగ్‌లోను బాగా రాణించాడు. ఐపీఎల్ ట్రోపీ గెలుపుపై యువరాజ్ ఉద్వేగానికి లోనయ్యాడు. ట్రోఫీ గెలిచిన అనంతరం అందరితో పాటు సంబరాలు చేసుకున్నాడు.

ఆ తర్వాత ప్రియురాలు హాజల్‌తో సంబరాలు చేసుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఎక్కిన బస్సులో యువీతో పాటు హాజల్ కూడా ఉన్నారు. యువీ తనకు కాబోయే భార్య హాజల్ తర్వాత కూర్చున్నాడు. హాజల్ కూడా వారితో గెలుపును పాటు ఎంజాయ్ చేసింది.

Yuvraj Singh celebrates with Hazel Keech after Sunrisers Hyderabad lift maiden IPL title

ట్రోఫీపై యువరాజ్..

ఎట్టకేలకు ఐపీఎల్‌ ట్రోఫీ అందుకున్న యువీ చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రపంచకప్‌లు గెలిచినప్పుడు లభించిన జ్ఞాపికల సరసనే దీనిని ఉంచుతానని చెప్పాడు. రెండు ప్రపంచ కప్‌లు గెలిచిన భారత జట్లలో యువరాజ్ సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచేందుకు 9 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది.

ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచినందుకు సంతోషంగా ఉందని, ఇంతకుముందు ప్రపంచకప్‌లు గెలిచానని, కానీ ఎప్పుడూ ఐపీఎల్‌ ట్రోఫీ గెలవలేదని, ఎనిమిదేళ్లుగా ఈ టోర్నీ ఆడుతున్నానని, ఎట్టకేలకు ఇప్పుడు ట్రోఫీ గెలిచానని, ఈ ట్రోఫీని నా ప్రపంచకప్‌ జ్ఞాపికల సరసన ఉంచుతానని చెప్పాడు.

ఫైనల్లో విరాట్‌ కోహ్లి, క్రిస్ గేల్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసినా తాము పోరాడి గెలిచామని చెప్పాడు. తాము ఫీల్డింగ్‌ కూడా బాగా చేశామని యువరాజ్ చెప్పాడు. తమ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ సమష్టిగా రాణించి కప్పు గెలిచిందన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+