కెసిఆర్ ఉక్కిరిబిక్కిరి

K Chandrasekhar Rao
పార్టీ రాజకీయ పరిణామాలు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పార్టీకి రాజీనామాలు చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఆయన పడ్డారు. తాజాగా మరో మైనారిటీ నాయకుడు అసమ్మతి జాబితాలో చేరిపోయారు. మునీరుద్దీన్ అనే నాయకుడు అసమ్మతి నేతలతో చేతులు కలిపారు. ఎన్నికలు ముగిసిన వెంటనే కెసిఆర్ బిజెపికి మద్దతు ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన అసమ్మతి నేతలతో కలిసిపోయారు. మైనారిటీ ఓటర్లను కెసిఆర్ మోసం చేశారని ఆయన విమర్శించారు. ఆయన అసమ్మతి నేత రెహ్మాన్ తో సమావేశమయ్యారు. కాగా, కెసిఆర్ ను వ్యతిరేకించి తెలంగాణ విమోచన సమితిని స్థాపించిన దిలీప్ కుమార్ రెహ్మాన్ కలవడానికి వచ్చారు. అక్కడ మీడియా ప్రతినిధులను చూసి రెహ్మాన్ తో సమావేశం కాకుండానే వెళ్లిపోయారు.

ఇదిలా ఉంటే, తెరాస శాసనసభ్యులు కాంగ్రెసుతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాన్ని ఖండించడానికి వారు సిద్ధమయ్యారు. పది తెరాస సభ్యులు సోమవారం మీడియా ముందు హాజరై తాము కాంగ్రెసుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. అయితే, కెసిఆర్ కు మాత్రం శాసనసభ్యులు ఐదేళ్ల పాటు కలిసికట్టుగా తన వెంటే ఉంటారనే నమ్మకం లేదు. ఎప్పుడు ఎవరు జారిపోతారనే ఆందోళన నెలకొని ఉంది.

తాజా పరిణామాలను చర్చించడానికి తెరాస పోలిట్ బ్యూరో సోమవారం సమావేశమైంది. ఈ సమావేశానికి కెసిఆర్ హాజరు కాలేదు. మొన్న ఏర్పాటైన పోలిట్ బ్యూరో సమావేశం నుంచి ఆయన అర్థాంతరంగా వెళ్లిపోయారు. అయితే ఆయన ఎజెండాను ఖరారు చేసే వెళ్లిపోయారని లక్ష్మీకాంతరావు స్పష్టం చేశారు. అయితే సమావేశంలో కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. కెసిఆర్ కు అత్యంత సన్నిహితులుగా మెలుగుతూ వచ్చిన మాజీ శాసనసభ్యులు విజయరామారావు, పద్మారావు వంటి వారు సమావేశంలో తీవ్ర విమర్శలు చేశారు. తనపై, తన కుటుంబ సభ్యులపై విమర్శలు వస్తున్నందున స్వేచ్ఛగా చర్చ జరగడానికి కెసిఆర్ సమావేశం నుంచి మధ్యలో బయటకు వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి.

మరో వైపు, పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి వ్యవహారం కెసిఆర్ తీవ్రమైన ఇరకాటంలో పెట్టింది. ఆమె పట్ల ఎలా వ్యవహరించాలో కూడా అర్థం కావడం లేదు. పార్టీలోని కొంత మంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది ఇంకా సంకటపరిస్థితి.ఈ సంకట పరిస్థితి నుంచి బయటపడడం కెసిఆర్ కష్టమే కావచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+