బాలయ్య ప్లాన్: జూ.ఎన్టీఆర్, చిరు టార్గెట్‌గా...

బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో ప్రచారం చేయడంతో సరిపోవడం లేదని, బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే అభిమానులు హర్షిస్తారని, ఎప్పటికైనా బాలకృష్ణ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకం వారిలో పెరుగుతుందని, అది తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి సినిమా ఇమేజ్‌ను ఎదుర్కోవడానికి బాలకృష్ణ సినిమా ఇమేజ్ పనికి వస్తుందని, స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వం దానికి అదనంగా వచ్చి చేరుతుందని అనుకుంటున్నారు.
కాగా, నారా లోకేష్‌కు చంద్రబాబు వారసత్వ పగ్గాలను అప్పంగించే ప్రయత్నాలకు నందమూరి హరికృష్ణ వ్యతిరేకంగా ఉన్నారు. నారా లోకేష్‌కు పోటీగా తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను దించుతున్నారు. ఈ స్థితిలో బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి తగ్గుతారని, బాలకృష్ణను ఎదుర్కోవడానికి ముందుకు రాబోరని, బాలకృష్ణ కారణంగా నందమూరి హరికృష్ణ కూడా అసమ్మతి రాజకీయాలకు స్వస్తి చెబుతారని భావిస్తున్నారు. దీంతో బాలకృష్ణను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తేవడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్‌ను నిలువరించే ప్రయత్నం సఫలమవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో నందమూరి హరికృష్ణ వచ్చే ఎన్నికల్లో శానససభకు పోటీ చేసి మంత్రి కావాలని అనుకుంటున్నారు. బాలయ్య శాసనసభకు వస్తే హరికృష్ణ ఆశలపై కూడా నీళ్లు చల్లడం చంద్రబాబుకు సులభమవుతుంది.












Click it and Unblock the Notifications