కెసిఆర్‌ ప్లాన్‌కు బెదురుతున్న ఇతర పార్టీలు

K Chandrasekhar Rao
తెలంగాణ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యూహానికి కాంగ్రెసు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు బెదిరిపోతున్నారు. రాజీనామాలు చేసి ఉప ఎన్నికలను ఆహ్వానించడం ద్వారా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను దెబ్బ తీయాలనే వ్యూహంతో కెసిఆర్ ముందుకు సాగుతున్నారు. అయితే, తాము రాజీనామాలు చేసి, వాటిని ఆమోదింపజేసుకుంటే తమ భవిష్యత్తు ఏమిటనే భయాందోళనలు వారిలో చోటు చేసుకున్నాయి. రాజీనామాలు చేస్తే గెలిపించే బాధ్యతను తాము తీసుకుంటామని కెసిఆర్ హామీ ఇస్తున్నారు. కానీ పరిస్థితి అలా ఉండకపోవచ్చు.

తెలంగాణ కోసం తాము రాజీనామాలు చేస్తే కాంగ్రెసు, తెలుగుదేశం నాయకత్వాలు పార్టీ ధిక్కారానికి పాల్పడ్డారనే ఆరోపణతో తమకు టికెట్లు ఇవ్వకపోవచ్చునని, వేరే వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయవచ్చునని, అప్పుడు తాము ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా శానససభ్యులు భయపడుతున్నారు. అప్పుడు స్వతంత్రులుగానో, లేదంటే తెరాసలో చేరో పోటీ చేయాల్సి వస్తుందని, దాని వల్ల పూర్తిగా కెసిఆర్ చేతి కిందికి వెళ్లి ఆయన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుందని వారు అనుకుంటున్నారు.

ఆ భయాల వల్లనే ఎన్నికలు వచ్చే వరకు పోటీ చేయకూడదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదనను కెసిఆర్ అసలు పట్టించుకోవడం లేదు. అలాగే, పార్టీలను పక్కన పెట్టాలని కూడా వారు చెబుతున్నారు. తెలంగాణ కోసమే తెరాస ఏర్పడింది. అందువల్ల ఆ పార్టీ నాయకులు తెరాసను పక్కన పెట్టే పరిస్థితి లేదు. పైగా, తెలంగాణపై ఇతర పార్టీలు అనుసరిస్తున్న వైఖరి కారణంగానే తెరాస క్రమంగా బలపడుతూ వస్తోంది. దాన్ని కెసిఆర్ చేజేతులా వదులుకోవడానికి సిద్ధపడరనేది అందరికీ తెలుసు. దానికి తోడు, తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులు అధిష్టానాల వైఖరితో, ప్రజల ఒత్తిడితో, కెసిఆర్ రాజకీయ వ్యూహాలతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ఓడించి తన సత్తా చాటాలనే కోరిక కూడా కెసిఆర్‌లో బలంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+