వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం కిరణ్ ఎవరి సలహాలు వినరు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై పట్టు సాధించుకోవడానికి వింత పోకడలకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. కిరణ్ సిఎంగా బాధ్యతలు చేపట్టి దాదాపు సంవత్సరం కావస్తోంది. ఇప్పటికీ ఆయనకు పాలనపై పట్టు రాలేదు. దీంతో ఇటీవలి కాలంలో ఆయన తన పట్టు పెంచుకోవడానికి ఎవరి సలహాలు లేకుండా సొంతగానే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. తరుచూ జరుగుతున్న సంఘటనలు ముఖ్యమంత్రి ఎవ్వరి మాట వినడు అన్న తీరుగా ఉన్నట్లు కనిపిస్తోంది. రూ.1కి కిలో బియ్యం పథకం అయినా మరేదైనా ఆయన కనీసం తన మంత్రివర్గంలో కూడా చర్చించడం లేదనే వాదనలు వినిపించాయి. ప్రతి అంశంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని పాలనపై పట్టు పెంచుకుందామనుకున్న ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఆయన వైఖరి కారణంగా పేరుకే మంత్రివర్గం ఉన్నట్లుగా కనిపిస్తోంది. పలువురు మంత్రులు ఆయనపై బహిరంగంగానే విమర్శలు చేస్తుండగా, మరికొందరు లోలోన కుమిలి పోతున్నారట.

చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావు ఇప్పటికి చాలాసార్లు సిఎంపై విరుచుకు పడ్డారు. తెలంగాణ అంశం, తనకు భద్రత పెంపు విషయాన్ని పక్కన పెడితే శాఖ విషయంలోనూ ఆయన సిఎంపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చెప్పినట్లుగా వినవద్దని తన శాఖ అధికారులకు సిఎం ఆదేశాలు జారీ చేస్తున్నారని దీంతో అధికారులు తనకు సహకరించడం లేదని శంకర్ రావు విలేకరుల సమావేశంలో బాంబు పేల్చారు. మరో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి సైతం బయటకు ముఖ్యమంత్రితో విభేదాలు లేవని చెప్పినప్పటికీ అసంతృప్తితోనే ఉన్నారనే వాదనలు వినిపించాయి. మరోవైపు హైదరాబాదుకు చెందిన మరో మంత్రి తన శాఖకు సంబంధించిన ఫైల్స్ తన అనుమతి లేకుండానే చక చకా కదులుతున్నాయని, అందుకు సిఎం కిరణే కారణమని ఆవేదన వ్యక్తం చేశారట.

సిఎంకు దగ్గరగా ఉన్న మంత్రులలో ఒకరైన తెలంగాణ ప్రాంత మంత్రి శ్రీధర్ బాబు సైతం ఇటీవల సిఎం తీరుపై అలిగారు. రూ.1కి కిలో బియ్యం పథకం తన శాఖకు సంబంధించినదే అయినప్పటికీ తన మాట మాత్రమైనా చెప్పకుండా ప్రకటించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి అంతే అసంతృప్తితో ప్రకటన చేసే సమయంలో మేం పక్కనే ఉన్నప్పటికీ మాకు కూడా చెప్పకుండా కిరణ్ ప్రకటన చేశారని అయితే ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా మనం సర్దుకు పోక తప్పదని శ్రీధర్ బాబును బుజ్జగించాలట. పలు కీలక నిర్ణయాలలో ముఖ్యమంత్రి మంత్రివర్గంతో చర్చించక పోవడం, కనీసం సంబంధింత మంత్రికి సైతం తెలియకుండా చేయడంతో దాదాపు మెజార్టీ మంత్రులు ఆయన పట్ల తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వంపై పట్టు సాధించుకోవాలనే ఆతృతలో సిఎం కిరణ్ ఎవరి సలహాలు తీసుకోకుండా సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లడం విమర్శలకు తావిస్తోంది.

English summary
It seems, CM Kiran Kumar Reddy did not hearing others suggestion. He announcing government schemes without ministers interfere.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X