వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి వర్గం మంత్రులకు గండమేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah-Ganta Srinivas Rao
తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గానికి చెందిన మంత్రులు గంటా శ్రీనివాస రావు, సి.రామచంద్రయ్యకు కట్టబెట్టిన మౌలికా సదుపాయాలు, దేవాదాయ శాఖలు కలిసి వచ్చే శాఖలు కావనే వాదనలు వినిపిస్తున్నాయి. బుధవారం ఉదయం గంటా శ్రీనివాస రావు సచివాలయంలో మంత్రిగా తన బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సి.రామచంద్రయ్య తదితరులు వచ్చారు. కాకినాడలో పోర్టు భవనానికి రూ.30 కోట్లను కేటాయిస్తూ గంటా ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. కాగా గంటాకు కేటాయించిన చాంబర్ హెచ్ సౌత్ బ్లాకు మూడో అంతస్థులోనిది. ఇందులో ఇటీవలి వరకు మాజీ మంత్రి శంకర రావు ఉండే వారు. ఈ చాంబర్ ఎవరికీ కలిసి రాదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చాంబర్‌లో అడుగు పెట్టిన వారు అనూహ్య పరిస్థితుల్లో మంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తోందంట. చాంబర్ వాస్తు బాగా లేదనే వాదనలు ఉన్నాయి. అందుకే శంకర రావు బర్తరఫ్ అయ్యారని, ఇప్పుడు గంటా పరిస్థితి ఏమిటో అనే ప్రశ్న పలువురిలో తలెత్తుతోంది.

మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య పరిస్థితి అదే. ఆ శాఖకు చెందిన మంత్రికి రాజకీయంగా నష్టం కలుగుతుందనే వాదనలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేసిన గాదె వెంకట రెడ్డి ఆ తర్వాత రాజకీయంగా బలహీన పడ్డారట. 2009లో మంత్రివర్గంలో కూడా ఆయనకు చోటు దక్కలేదు. దీంతో దేవాదాయ శాఖ వస్తే వారి పని అంతే అనే గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావుకు ఇదే శాఖను కేటాయించారు. ఆయన అసంతృప్తిగానే దీనిని తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ వాదంతో టిఆర్ఎస్‌లో చేరారు. ఐతే తనకు కేటాయించిన ఈ శాఖపై అసంతృప్తి వల్లనే ఆయన బయటకు వెళ్లారనే ప్రచారం ఉంది. ఆ తర్వాత ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ శాఖ బాధ్యతలను సిఎం అప్పగించారు. ఆయన అసంతృప్తిగానే దీనిని తీసుకున్నారు. తాజాగా సి.రామచంద్రయ్యకు ఈ శాఖ కేటాయించడంతో ఆయన రాజకీయ జీవితంపై ఏమైనా ప్రభావం పడుతుందా అనే చర్చలు ఊపందుకున్నాయి.

English summary
Discussion are going on Ganta Srinivasa Rao and C.Ramachandraiah posts in political parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X