ముహూర్త బ‌లం మామూలుగాలేదు.. ఈనెల‌ 12 నుంచి డిసెంబర్ 16 మ‌ధ్య‌ 48 ల‌క్ష‌ల పెళ్లిళ్లు!

సాంప్రదాయ పెళ్లిళ్ల‌కు మ‌న దేశం కేరాఫ్ అడ్ర‌స్ లాంటిది. ఏటా ముహూర్త బ‌లంతో ఒక్క‌ట‌వుతున్న జంట‌ల సంఖ్య భార‌త్‌లో ల‌క్ష‌ల్లో ఉంటుంది. అయితే, ఇటీవ‌ల కాలంలో ఆ సంఖ్య క్ర‌మంగా పెరుగుత‌న్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. తాజాగా పెళ్లిళ్ల సీజర్ మళ్లీ వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో కేవ‌లం ఒకేఒక్క నెల‌లో ఒక్క‌ట‌వ‌బోతోన్న జంట‌ల సంఖ్య సుమారు 48 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉందంటే కాస్త ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది.

గ‌తంలో రూ. 4.25 లక్షల కోట్లు..

ఈ ఏడాది నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 వరకు మ‌న‌ దేశంలో 48 లక్షల జంట‌లు పెళ్లితో ఒక్క‌ట‌వ్వ‌బోతున్నార‌ట‌! అంతేకాదు ఈ పెళ్లిళ్ల కార‌ణంగా ఏకంగా దేశ ఆర్థిక వ్యవస్థలో భారీగా వృద్ధి క‌నిపించ‌నుంది. అవునండీ..! దాదాపుగా రూ. 6 లక్షల కోట్ల వ‌ర‌కూ ఈ సీజ‌న్‌లో వ్యాపారం జరిగే అవకాశం ఉంద‌ని అంచ‌నా. అంతేకాదు, గతేడాది ఇదే సీజ‌న్‌లో జరిగిన వ్యాపారంతో పోలిస్తే 41 శాతం ఎక్కువ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌. ఇదే సీజ‌న్‌లో గ‌త సంవ‌త్స‌రం రూ. 4.25 లక్షల కోట్ల వ్యాపారం జ‌ర‌గ‌గా.. అది ప్ర‌స్తుతం ఆరు ల‌క్ష‌ల కోట్ల‌కు చేర‌నుంది.

48 lakh marriages between November 12th to December 16th

సీఏఐటీ నిర్వహించిన అధ్యయనం..

సీజ‌న‌ల్ వివాహాలతోపాటు ఆ స‌మ‌యంలో ఆర్థిక లావాదేవీల‌పై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) నిర్వహించిన అధ్యయనం ఈ గ‌ణాంకాలు వెల్ల‌డ‌య్యాయి. గ‌త సంవ‌త్స‌రం ఈ సీజ‌న్‌లో 35 లక్షల వివాహాలు జ‌ర‌గ‌గా, 48 ల‌క్ష‌ల పెళ్లిళ్లు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ సీజన్‌లో నవంబర్ 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29 మరియు డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో శుభప్రదమైన వివాహ తేదీలుగా గుర్తించారు. వీటి తర్వాత ఒక నెల విరామం అనంతరం జనవరి నుంచి మార్చి 2025 మధ్యలో మళ్లీ వివాహాల సీజన్ ప్రారంభం కానుంది. దీంతో ఈ సీజ‌న్ గ‌తంతో పోల్చుకుంటే మంచి వృద్ధి రేటును చూసిస్తుంద‌ని ఆర్థిక నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

పెళ్లిళ్ల ఖ‌ర్చు జాబితా ఇలా..

అధ్య‌య‌నం అంచ‌నా ప్ర‌కారం.. పెళ్లిళ్ల ఖ‌ర్చు జాబితాను రూపొందించారు. రూ. 3 లక్షల ఖర్చుతో 10 లక్షల పెళ్లిళ్లు, రూ. 6 లక్షల ఖర్చుతో 10 లక్షల పెళ్లిళ్లు, రూ. 10 లక్షల ఖర్చుతో 10 లక్షల పెళ్లిళ్లు, రూ. 15 లక్షల ఖర్చుతో 15 లక్షల పెళ్లిళ్లు, రూ. 25 లక్షల ఖర్చుతో 7 లక్షల పెళ్లిళ్లు, రూ. 50 లక్షల ఖర్చుతో 50 వేల పెళ్లిళ్లు, రూ. 1 కోటి ఖర్చుతో 50 వేల పెళ్లిళ్లు జ‌ర‌గ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

అంతేకాదు, ఈ పెళ్లిళ్ల ఖ‌ర్చులు విషయాని వస్తే.. ఆభరణాలు (15 శాతం), దుస్తులు (10 శాతం), ఎలక్ట్రానిక్స్ మరియు ఉపకరణాలు (5 శాతం), డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, స్నాక్స్ (5 శాతం) వంటి వస్తువులలో ప్రధాన ఖర్చులు ఉంటాయి. కిరాణా సామాన్-కూరగాలలకు (5 శాతం), గిఫ్ట్స్ (4 శాతం), ఇతర వస్తువులు(6 శాతం) పెళ్లి ఖర్చులు ఉండనున్నాయి. బాంక్వెట్ హాళ్లు-హోటళ్లు-వేదికలు (5 శాతం), క్యాటరింగ్ సేవలు (10 శాతం), ఈవెంట్ మేనేజ్‌మెంట్- పూల అలంకరణలు- రవాణా - క్యాబ్ సేవలు (3 శాతం), ఫోటోగ్రఫీకి - వీడియోగ్రఫీ ఖర్చులు (2 శాతం) ఉండే అవకాశం ఉన్న‌ట్లు అంచ‌నాకు వ‌చ్చంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+