అమ్మాయిని అప్సర పెన్సిల్‌తో పోల్చిన యువకుడు.. వైరల్‌గా మారిన పోస్ట్..
ఈ మధ్యకాలంలో ఏ అమ్మాయిని చూసినా సన్నగా, నాజుగ్గా కనిపిస్తున్నారు. చాలామంది జీరో సైజులు మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి అమ్మాయిలనే చాలామంది అబ్బాయిలు కూడా ఇష్టపడుతుంటారు. సాధారణంగా ఒక అబ్బాయి, అమ్మాయికి నువ్వు చాలా అందంగా ఉన్నావు అనే కాంప్లిమెంట్ ఇవ్వాలంటే, వివిధ రకాలుగా కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు.
వారి ఫీలింగ్స్‌ను పంచుకునేందుకు వినూత్న రకాల పద్ధతులను అవలంభిస్తుంటారు. అందంగా ఉన్న అమ్మాయిలు ఎవరైనా కనపడితే నువ్వు సమంతలా ఉన్నావ్, నువ్వొక అప్సరసలా ఉన్నావ్ అంటూ ఉంటారు. అయితే పూణేకు చెందిన ఓ అబ్బాయి మాత్రం ఓ అమ్మాయిని అప్పర పెన్సిల్‌తో పోల్చాడు. ఈ పోస్ట్ కాస్త ఇప్పడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

వినూత్న పద్ధతిలో: పూణే లో ఓ అబ్బాయి అమ్మాయిని చూసి ఫిదా అయిపోయాడు. తన మనసులోని భావాలను వ్యక్తపరిచేందుకు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టాడు ఆ అబ్బాయి. నువ్వొక 'అప్సర'లా ఉన్నావు అని చెప్పేందుకు ఎంతో చాకచక్యంగా తన తెలివితేటల్ని వాడాడు. ఆ అబ్బాయి ఎంతో తెలివిగా ఆ అమ్మాయికి ఓ స్లిప్ ఇచ్చాడు. ఆ స్లిప్‌ను చూసినా ఆ అమ్మాయి ఆ అబ్బాయి రాసిన పదాలకు ఫిదా అయిపోయింది. ఆ స్లిప్‌ను ఆ అమ్మాయి ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, అదికాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. పూణెలో రోడ్డు మీద నడిచి వెళ్తున్న ఆమెకు ఓ కుర్రాడు ఎదురుగా వచ్చాడు.
ఆ అబ్బాయి ఆమె వద్దకు వచ్చి ఇదేదో కిందపడిపోయింది ఇది మీదేనా అంటూ ఓ స్లిప్ ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఆమె ఆ అబ్బాయి ఇచ్చినా స్లిప్ తీసుకుని చూసి షాక్ అయ్యింది. స్లిప్ తెరిచి చూసి చదివింది ఆ తర్వాత చిన్నగా ఓ నవ్వు నవ్వింది. ఇంతకీ ఆ స్లిప్ లో ఏముందో తెలుసుకోవాలని మీకు ఉంది కదా...అందులో ఇలా రాసి ఉంది.. మీరు పెన్సిలా? దూరం నుంచి చూస్తే అప్సరలా కనిపిస్తున్నారు.. అంటూ చివర్లో స్మైలీ సింబల్ వేశాడు. ఈ దెబ్బకు ఆ అమ్మాయి కాస్త ఫిదా అయిపోయింది. అప్సర పెన్సిల్ ను ఇలా కూడా ఉపయోగిస్తారా..? అనుకుంది.
fc road gives you crazy validation.
— Sanjal Sangle (@gunnergworl) October 15, 2023
was walking down the street when this dude handed me this paper saying I dropped it😭😭 pic.twitter.com/DB2s0anrIX
తనకు కాంప్లిమెంట్ ఇచ్చిన విధానం బాగా నచ్చి ఆ స్లిప్‌ను ఫొటో తీసి సోషల్‌మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో కాస్త వైరల్‌గా మారింది...ఈ పోస్ట్‌కు తెగ కామెంట్లు వచ్చేస్తున్నాయి. కొంతమంది తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఐడియా బాగుంది గురూ అని ఒకరంటే, దీనిని మేము ట్రై చేస్తామని మరికొందరు... ఇది ఒక గుడ్ మెమరీ అంటూ ఇంకొరు ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు..












Click it and Unblock the Notifications