డిసెంబర్‌లో 18 రోజులు బ్యాంకులకు సెలవు...
ఈ సంవత్సరం చివరి నెలలో బ్యాంకులు మొత్తంగా 18 రోజులు మూతపడనున్నాయి. డిసెంబర్‌లో వచ్చే పండుగలు, వారాంతాలతో కలిపి మొత్తం 18 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. కాబట్టి బ్యాంకు పని ఉన్నవారైవనా ముందుగానే మీ పనులను పూర్తిచేసుకోండి.
వినియోగదారుల సౌకర్యార్థం భారతీయ రిజర్వు బ్యాంకు నెల నెల బ్యాంకుల సెలవుల జాబితాను ముందుగానే ప్రకటిస్తుంది. కాబట్టి నేడు డిసెంబర్ నెల ప్రారంభం సందర్భంగా ఈనెలలో వచ్చే బ్యాంకు సెలవుల జాబితాను కూడా ఆర్‌బిఐ ప్రకటించింది. ఈ నెలలో మొత్తం 18 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. కాబట్టి బ్యాంకు పని ఉన్నవారు తప్పకుండా వారిని పనులనున సకాలంలో పూర్తిచేసుకోగలరు. అయితే ఆర్‌బీఐ ప్రకటించిన సెలవుల జాబితాలోని బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండుగల ప్రకారం సెలవులను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్ హాలిడేస్ మాత్రం కామన్‌గా ఉంటాయి. కాబట్టి ఈనెలలో బ్యాంకు సెలవుల జాబితా ఓసారి చూసేయండి.

డిసెంబర్ నెలలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..
డిసెంబర్ 1 (శుక్రవారం) - అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఆవిర్భావ దినోత్సవం / స్థానిక విశ్వాస దినోత్సవం.
డిసెంబర్ 3 (ఆదివారం) - దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 4 (సోమవారం) - సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ ఫీస్ట్ డే - గోవాలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 9 (రెండో శనివారం) - దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 10 (ఆదివారం) - దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 12 (మంగళవారం) - పా-తోగాన్ నెంగ్మింజా సంగ్మా - మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 13, 14 (బుధ, గురువారం) - లోసూంగ్/ నామ్ సూంగ్ - సిక్కింలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 17 (ఆదివారం) - దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 18 (సోమవారం) - యూ సోసోథామ్ వర్ధంతి - మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 19 (మంగళవారం) - గోవా విముక్తి దినోత్సవం - గోవాలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 23 (నాలుగో శనివారం) - దేశవ్యాప్తంగా సెలవు.
డిసెంబర్ 24 (ఆదివారం) - దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 25 (సోమవారం) - క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 26 (మంగళవారం) - క్రిస్మస్ సంబురాల సందర్భంగా మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు.
డిసెంబర్ 27 (బుధవారం) - క్రిస్మస్ సంబురాల సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 30 (శనివారం) - యూ కియాంగ్ నాంగ్ బాహ్- మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 31 (ఆదివారం) - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications