జూన్‌ నెలలో 13 రోజులు బ్యాంక్‌లకు సెల‌వులు..

ప్రతి నెలా, బ్యాంక్‌ సెలవులను ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే బ్యాంక్ సెల‌వు రోజులు ముందుగా తెలుస‌కోవ‌డం వ‌ల్ల ముందుగానే బ్యాంక్‌ల‌కు వెళ్లొచ్చు. లేదా ఆ తేదీల్లో వెళ్లేవారు త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను మార్చుకోవ‌చ్చు. బ్యాంక్ ప‌నిచేసే రోజులు ముందుగానే తెలుసుకుంటే మంచిది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఆ జాబితా మ‌న‌కు ఎంత‌గానో ఉపయోగపడుతుంది.

బ్యాంక్ సెల‌వు రోజులు ముందే తెలుసుకోవ‌డం వ‌ల్ల బ్యాంక్‌ పని చేసే రోజులు కచ్చితంగా తెలుస్తాయి. కాబట్టి, ఆ రోజుల్లోనే బ్యాంక్ ప‌ని ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. కొన్నిసార్లు 5 ఆదివారాలు, రెండో & నాలుగో శనివారాల కారణంగా బ్యాంక్‌లు 13 రోజులు పని చేయవు. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండవు, ప్రాంతాన్ని బట్టి సెల‌వులు మారుతూ ఉంటాయి.

Bank holidays for 13 days in the month of June

జూన్ నెల‌లో వ‌చ్చే సెల‌వుల జాబితా ఏంటో చూసేద్దాం..

02 జూన్ 2024: (ఆదివారం), దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా.

08 జూన్ 2024: (రెండో శనివారం), దేశవ్యాప్తంగా బ్యాంక్‌లను మూసేస్తారు

09 జూన్ 2024: (ఆదివారం), దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

10 జూన్ 2024: (సోమవారం), శ్రీ గురు అర్జున్ దేవ్ జీ బలిదానం.. పంజాబ్‌లో బ్యాంక్‌లకు సెలవు

14 జూన్ 2024: (శుక్రవారం), పహిలి రాజా... ఒడిశాలో బ్యాంక్‌లు పని చేయవు

15 జూన్ 2024: (శనివారం), రాజా సంక్రాంతి... ఒడిశాలో బ్యాంక్‌లు పని చేయవు

15 జూన్ 2024: (శనివారం), YMA డే...మిజోరంలో బ్యాంక్‌ల‌కు సెల‌వులు ఉంటాయి

16 జూన్ 2024: (ఆదివారం), దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

17 జూన్ 2024: (సోమవారం), బక్రీద్/ఈద్ అల్ అధా.. కొన్ని రాష్ట్రాలు మినహా జాతీయ సెలవుదినం.

21 జూన్ 2024: (శుక్రవారం), వట్ సావిత్రి వ్రతం...చాలా రాష్ట్రాల్లో బ్యాంక్‌లకు సెలవు

22 జూన్ 2024: (శనివారం), సంత్ గురు కబీర్ జయంతి.. ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో బ్యాంక్‌లు పని చేయవు. రెండో శనివారం కాబట్టి మిగిలిన రాష్టాల్లోనూ సెలవు రోజు ఉంటుంది.

23 జూన్ 2024: (ఆదివారం), దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

30 జూన్ 2024: రెమ్నాని.. మిజోరంలో సెలవు. ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+