ఒకే పాఠ‌శాల‌లో ఐదుగురు క‌వ‌ల‌ జంట‌లు...క‌న్య్ఫూజ్ అవుతోన్న ఉపాధ్యాయులు..

న‌టుడు నాగార్జున న‌టించిన హాలోబ్ర‌ద‌ర్ సినిమా చూశారా.. అందులో నాగార్జున డ‌బ‌ల్ రోల్‌లో హీరోయిన్ సౌంద‌ర్య, ర‌మ్య‌కృష్ణ‌ల‌తో ఒక ఆట ఆడుకుంటాడుగా.. ఒకేమ‌నిషిలా ఇంకోక‌రు ఉంటేనే స‌రిగా పోల్చుకోలేం. అలాంటి క‌వ‌ల జంట‌లు ఐదుగురు ఉంటే ప‌రిస్థితి ఏంటీ? నిజ‌మేనండి బెంగుళూరులోని ఓ పాఠ‌శాల‌లో ఐదుగురు క‌వ‌ల జంట‌లు ఉన్నారు. ఎవ‌రో ఏంటో తెలుసుకోలేక ఆ పాఠ‌శాల‌లోని ఉపాధ్యాయులు తెగ క‌న్య్ఫూజ్ అవుతున్నార‌ట‌... ఇంత‌కీ ఆ క‌థేంటో ఓసారి తెలుసుకుందాం ప‌దండి...

పేర్లు కూడా ఒకేలాంటివే : రఫియా-రూఫియా, కమిలా-సమీలా... ఇలా ఒక్క‌పేరు కాదు. ఐదు జంట‌ల పేర్లు అంటే ప‌ది మంది బాలిక‌ల పేర్లు ఒకే విధంగా ఉన్నాయి. కర్ణాటకలోని ఈ గ్రామంలో 5 కుటుంబాలకు చెందిన 10 మంది బాలిక‌లు క‌వ‌ల‌లు. వీరంతా మంగళూరులోని ఓ గ్రామంలో ఒకే తరగతి చదువుతున్నారు. ఈ పిల్లలను గుర్తించడంలో ఉపాధ్యాయులు కూడా ఫెయిల్ అవుతున్నారు. ఇలాంటి సీన్లు ఎక్కువ శాతం మ‌నం సినిమాల్లోనే చూసి ఉంటాం. మ‌నిషిని పోలీన మ‌నుషులు ఇద్ద‌రూ ఉండ‌డం.. ముగ్గురూ ఉండ‌డం.. కానీ, అది సినిమా.. ఇది నిజజీవితం..నిజ‌జీవితంలో ఇలాంటి దృశ్యాల‌ను చూడాలంటే కాస్త ఆశ్చ‌ర్యంగానూ వింత‌గానూ ఉంటుంది. ఇలాంటి వింతే ఇప్పుడు కర్ణాట‌క‌లో కూడా ఉంది. ఇక్కడ ఒకే గ్రామంలో ఐదుగురు కవల పిల్లలు ఉన్నారు.

Five pairs of twins in the same school...teachers getting confuse..

62 మందిలో ఐదుగురు క‌వ‌ల జంటలు : మంగుళూరులోని బంట్వాల్ తాలూకాలోని సజిపాముడలోని DKZP హైస్కూల్‌లో VIII తరగతి ఉపాధ్యాయుడు హార్తీ ఈ పిల్ల‌ల్ని గుర్తించ‌డంలో చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాడు. అతని తరగతిలో 62 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఐదుగురు కవల జంట‌లు. అంటే ప‌ది మంది బాలిక‌లు. వీరిలో ఉన్న తేడాను ఎవ‌రు గుర్త‌ప‌ట్ట‌లేక‌పోతున్నారు. ఐదుగురి జంట క‌వ‌ల‌లో ఒక జంట హిందూ సమాజానికి చెందినవారు .మిగిలిన నాలుగు జంటలు ముస్లిం సమాజానికి చెందినవి. అంతే కాదు. వీరంతా ఒకే పాఠశాలలో ఒకే తరగతి చదువడం విశేషం. కవలలు తరచుగా రూపం, కార్యాచరణలో ఒకేలా ఉంటారు కాబట్టి, ఉపాధ్యాయులు, వారి సహవిద్యార్థులు కొన్నిసార్లు అయోమయానికి గురైన సందర్భాలు ఉన్నాయి. ఒక్కోసారి క్లాస్‌మేట్స్‌ను మోసం చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.

ప్ర‌తి ఏటా క‌వ‌లలు ఇక్క‌డ అడ్మిష‌న్ తీసుకుంటారు : 2010-11లో జన్మించిన ఈ కవలలు ఫాతిమా రౌలా-అయేషా రైఫా, హలీమత్ రఫియా-దులైకత్ రూఫియా, ఫాతిమా కమీలా-ఫాతిమా సమీలా, ఖతీజా జియా-ఆయేషా జీబా, జాన్వి-శ్రణవి. ఈ జంట‌లే కాకుండా అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక అబ్బాయి-అమ్మాయి కూడా కవలలు కావ‌డం విశేషం. విన‌డానికే విచిత్రంగా ఉంటే, ఈ విచిత్ర దృశ్యాన్నే చూస్తే ఎలా ఉంటుందో చెప్పండి. 2012 నుండి ఈ పాఠశాలలో ఎప్ప‌డూ కనీసం ఒక జంట కవల‌లు విద్యార్థులుగా జాయిన్ అవుతున్నార‌ని ఇక్క‌డి ఉపాధ్యాయుడు చెబుతున్నారు. "ఉపాధ్యాయులు మాత్రమే కాదు, విద్యార్థులు కూడా కొన్నిసార్లు మమ్మల్ని గుర్తించడానికి చాలా కష్టపడతారు" అని కవలలు చెబుతున్నారు.

ఈ విధంగా గుర్తిస్తున్నారు : అయితే, చాలా సంద‌ర్భాల్లో అసైన్‌మెంట్‌లు, హోంవ‌ర్క్‌ల విష‌యంలో ఒక‌రిని నిందించాల్సింది మ‌రొక‌రిని నిందించిన‌ట్లు స్కూల్ ప్రిన్సిపాల్ చెబుతున్నారు. అయితే, వీరిని గుర్తించేందుకు పాఠ‌శాలే వారు స్వ‌యంగా సొంత ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంభించారు. అవేంటంటే, చ‌ర్మం రంగు ఆధారంగా ఒక జంట‌ను, పుట్టుమ‌చ్చ‌ల ఆధారంగా మ‌రోక జంట‌ను గుర్తించేలా చేశారు. 'జాన్వీకి తలపై మచ్చ ఉంది. హలీమత్ రఫియాకు ముఖంపై పుట్టుమచ్చ ఉంటుంది. ఖతీజా, అయేషా చర్మం రంగును బట్టి గుర్తించవచ్చు. ఈ ప‌ద్ధ‌తుల‌తో వీరిని గుర్తిస్తున్నారు. ఎవ‌రైనా కొత్త వారు వెళితే మాత్రం క‌న్య్ఫూజ‌న్ అవ్వ‌క త‌ప్ప‌దు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+