వినియోగ‌దారుల‌కు శుభవార్త‌... దిగిరానున్న ట‌మోట‌ ధ‌ర‌లు..

వినియోగ‌దారుల‌కు శుభవార్త‌... మ‌రికొన్ని రోజుల్లో ట‌మోట, ఉల్లిధ‌ర‌లు సాధార‌ణ స్థాయికి రానున్నాయి. ఢిల్లీ వాసుల‌కు దక్షిణాదిలోని రెండు రాష్ట్రాల నుండి ఓ శుభవార్త అందింది. త్వరలోనే ఈ రెండు రాష్ట్రాల నుంచి టమాటాల సరఫరా పెరిగే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం. దీంతో టమాట ధరలు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో కిలో టమాటా రూ.75 ఉంది. దీంతో సామాన్య ప్ర‌జ‌లు ట‌మాటాలు కొనలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ట‌మాట సరఫరాలో తీవ్ర అంతరాయం రావ‌డంతోనే టమాటా, ఉల్లి ధరలు పెరిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే, త్వరలోనే వీటి ధ‌ర‌లు స్థిరపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

దేశ రాజధాని ఢిల్లీతోపాటు మరికొన్ని ప‌ట్ట‌ణాల్లో టమాటా, బంగాళదుంపలు, ఉల్లిపాయల ధరలు వీప‌రీతంగా పెరిగాయ‌ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి పేర్కొన్నారు. భారీ వర్షాల అనంత‌రం వేడి కారణంగా కూర‌గాయాల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింద‌ని, దీంతో చిల్లర ధరల పెరుగుదలకు దారితీసిందని అధికారులు తెలుపుతున్నారు. ఇక ఢిల్లీలో టమాటా ధర కిలో రూ.75కి చేరిందని, అయితే భారీ వర్షాల నేప‌థ్యంలో వీటి సరఫరాకు అంతరాయం కలగకపోతే కూర‌గాయ‌ల ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

Good news for consumers Tomato prices coming down

ఆ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి స‌ర‌ఫ‌రా..

గణాంకాల ప్రకారం, నిన్న (శ‌నివారం) ఢిల్లీలో టమాటా రిటైల్ ధర కిలో రూ.77 ప‌లికింది. సంవ‌త్స‌రం క్రితం ఇదే స‌మ‌యంలో ట‌మాట కిలో ధర రూ.150గా ఉంది. జులై 13వ తేది మొత్తం భారతదేశ సగటు రిటైల్ టమాటా ధర కిలో రూ.67.65గా ప‌లుక‌గా, గతేడాది ట‌మాట కిలో ధ‌ర‌ రూ.53.36గా ఉన్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని 13 రాష్ట్రాల్లో టమాటా ధర కిలో 70 రూపాయ‌లు పలుకుతుంది. ఇందులో భాగంగానే ఢిల్లీకి ట‌మోటాలు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఉనంచి సరఫరా అవుతున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.

ఏపీ, క‌ర్ణాట‌క రాష్ట్రాల నుంచి ఢిల్లీకి హైబ్రిడ్ టమోటాలు స‌ర‌ఫ‌రా కావ‌డంతో వీటి ధరలు తగ్గుముఖం పడ‌తాయ‌ని అధికారులు చెబుతున్నారు. సబ్సిడీ టమోటాల విక్రయాలను పునఃప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం లేన‌ట్లు తెలుస్తోంది. గత సంవ‌త్స‌రం కిలో ధర రూ.110 దాటడంతో ప్ర‌భుత్వం ఈ చర్యను అమలు చేసింది. ఇప్ప‌డు ఆ ప‌రిస్థితి లేన‌ట్లు క‌నిపిస్తోంది. ఇక‌, ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి సరఫరా మెరుగుపడటంతో రాబోయే రెండు వారాల్లో ట‌మోట ధరలు సాధారణ స్థితికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+