కుల్ఫీ అమ్ముతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు... నిజమేనంటారా..?
2024 నవంబరులో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలపై ఇప్పటికే అక్కడ హోరాహోరి నడుస్తోంది. అయితే, ఈ తరుణంలో సోషల్‌మీడియాలో వస్తున్న ఓ వీడియో అందరినీ ఆశ్చర్యానీకి గురిచేసింది. ఆ వీడియో ఏంటీ అనుకుంటున్నారా? వీధుల్లో కుల్పీ అమ్మూతూ కనిపించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. అయితే, ఈ వీడియోను చూసి చాలామంది షాక్‌కు గురయ్యారు. అదేంటీ అమెరికా మాజీ అధ్యక్షుడు కుల్పీ అమ్మడం ఏంటీ అనుకుంటున్నారు. అయితే ఇందులో వింతేముంది అంటున్నారు మరికొందరు.
ఎందుకంటే, భారతదేశంలో ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నాయకులు చేయని పనంటూ ఏదీ ఉండదు. విచిత్రమైన పనులు, విచిత్ర వేషధారణాలు అన్నీ అప్పడు కనిపిస్తాయి. అయితే అదే విధంగా అమెరికాలో కూడా జరుగుతుందేమో అనుకుంటున్నారు కొందరు. ఎన్నికల కోసం ట్రంప్ ఏకంగా కుల్పీ అమ్ముతున్నారా? అని అనుకుంటున్నారు. మీరు కూడా అలా అలోచిస్తే మాత్రం బురదలో కాలేసినట్లే... అవునండి.. అక్కడ కుల్పీ అమ్ముతున్నది అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కాదు. ట్రంప్‌ను పోలీన వ్యక్తి...

పాకిస్తాన్‌లో ట్రంప్‌ను పోలీన వ్యక్తి. : ఇది వాస్తవం. నిజంగా ట్రంప్‌ను పోలిన ఓ వ్యక్తి పాకిస్థాన్‌లో ఉన్నాడు. ఆ వ్యక్తి అచ్చం డోనాల్డ్ ట్రంప్ పోలీకలతో ఉంటారు. ఆయన పాక్ పంజాబ్ లోని సాహివాల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అక్కడి వారు ఆయనను ముద్దుగా 'చాచా బగ్గా' అని పిలుస్తారు. ఆయన ఎంతో అద్భుతంగా పాటలు కూడా పాడతారు. అతని గాత్రానికి చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. కుల్ఫీ అమ్మేందుకు తాను వీధుల్లోకి వచ్చినట్లు చాచా తన పాటలతో అందరికీ తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు, ట్రంప్ అభిమానులు నిజంగా ఇతను ట్రంప్ లానే ఉన్నాడే అంటూ ఒకింత ఆశ్చరానికి గురవుతున్నారు. కొందరు ఈ వీడియోకు విచిత్రమైన కామెంట్లు కూడా పెడుతున్నారు.
Shocking 😇
— jat boy (@jatboy1341299) October 9, 2023
When did #DonaldTrump start selling ice cream?🤣#IsraelAtWar #อิสราเอล Trans Israel-Palestine #AssemblyElections2023 #Jeetenge Haaland #IsraelPalestineWar #KritiSanon #NZvsNED #IStandWithPalestine #ElectionCommission 3rd December Holocaust LAMINE YAMAL #IndiaVsAus pic.twitter.com/hr001KAWdf
గతంలో కూడా ఇలానే : అయితే, పాకిస్థాన్‌లో కుల్పీ అమ్మే ఈ చాచా గతంలో కూడా ఓసారి ఇలానే సందడి చేశారు. 2021లో కూడా ఇంటర్నెట్‌లో హల్చల్ చేశాడు. ట్రంప్ పోలికలున్న ఈ చాచా పాటలు పాడుతూ కుల్ఫీలు అమ్ముతున్న వీడియో అప్పట్లో కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అప్పడు కూడా ఈ వీడియోకు ఎంతో మంది నెటిజన్లు ఫిదా అయ్యారు. పాకిస్థాన్ ప్రముఖ గాయకుడు హెహజాద్ రాయ్ సైతం అప్పట్లో ఈ వీడియోను షేర్ చేశారు. 'వాహ్ కుల్ఫీ భాయ్, క్యా బాత్ హై..' అంటూ అతన్ని ప్రసంశించారు కూడా.












Click it and Unblock the Notifications