కుక్కకు సీమంతం చేసిన యజమాని... వైరల్‌గా మారిన వీడియో...
చాలామందికి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. అయితే, పెంపుడు జంతువుల జాబితాలో ఎక్కువగా కుక్కలే ఉంటాయి. సాధారణంగా కుక్కలు, పిల్లులు, మేకలు, ఆవులను పెంచుకోవడం చూస్తుంటాం. మేకలు, ఆవుల వల్ల ఎంతో కొంత లాభం ఉంటుంది. అయితే, ప్రస్తుత పరిస్థుతుల్లో చాలామంది ఇళ్లలో కుక్కలను పెంచుకుంటున్నారు. వాటిని తమ సొంత పిల్లల్లా చూసుకోవడం చేస్తున్నారు చాలామంది. మరికొందరైతే వాటిని కుటుంబసభ్యులతో సమానంగా చూస్తుంటారు. ఆ కుక్కలకు సంబంధించిన ప్రతి విషయాలను సోషల్‌మీడియాలో షేర్ చేసుకుంటుంటారు కూడా. తాజాగా ఓ యజమాని కూడా అదే పనిచేసింది. తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్కకు ఘనంగా సీమంతం చేసింది. ఆ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
పెంపుడు జంతువుల్లో ఎక్కువగా కుక్కలే..
విశ్వాసానికి మారుపేరుగా కుక్కలను చెబుతుంటాం. వాటికి నిదర్శనంగానే అవి కూడా యజమానుల కోసం ప్రాణాలను పణంగా పెట్టి మరీ వారిని కాపాడుతుంటాయి. చాలామంది పెంపుడు కుక్కలను ఇంటిసభ్యుల్లో ఒకరిలా చూస్తుంటారు. వాటికి పుట్టినరోజు వేడుకలు, సీమంతం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియోలో తెగ చెక్కర్లు కొడుతుంది.

కుక్కను అందంగా ముస్తాబు చేసిన యజమాని...
ఆ వీడియోలో ఓ మహిళ తన పెంపుడు కుక్కకు సీమంత చేస్తూ ఉంటుంది. అందులో కుక్కకు తిలకం దిద్ది, కుక్క రెండు కాళ్లకు గాజులు వేసింది. ఆ కుక్కకు ఎర్ర శాలువాను తలపై చుట్టి, తిలకం పెట్టింది. ఆ తర్వాత పూలు చల్లుతుంది. కుక్కకు ఇష్టమైన ఆహారాన్ని తినిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో గురించి చాలామంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూగజీవాలపై చూపిస్తున్న ప్రేమ ఎంతో అమోఘం అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో కుక్కలు ఎంతో విశ్వాసంతో ఉంటాయి. అలాంటి వాటికి ఇలాంటి వేడుకలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications