చంద్రబాబా? రాజశేఖరరెడ్డా?

ఈసారి టీఆర్ ఎస్, ఉభయ కమ్యూనిస్టుల మద్దతు లేకుండా అధికారంలోకి రాగలనన్న ఆత్మ విశ్వాసం వైఎస్ లో కనిపిస్తోంది. అది అతి విశ్వాసం కావచ్చు. 294 అసెంబ్లీ స్ధానాల్లో తన మనుషులనే పెట్టుకోవాలన్న తాపత్రయం వైఎస్ ది. ఒక వేళ కాంగ్రెస్ ఓడిపోయినా తన ఎమ్మేల్యేల మద్దతుతో ఇతరులను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన సన్నద్ధమవుతున్నారు.
ఎటూ ఎన్నికలు దగ్గరబట్టాయి కాబట్టి వైఎస్ కు పూర్తిగా సహకరించడానికి అధికారులు సిద్ధంగా లేరు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి ఫ్యాక్టర్ కారణంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశముంది. ఆ పరిస్ధితిని చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటారో, వైఎస్ ఉపయోగించుకుంటారోనన్న విషయం కేంద్రంలో ఏర్పడనున్న ప్రభుత్వాన్ని బట్టి ఆధార పడి ఉంటుంది.












Click it and Unblock the Notifications