మంచులో వైఎస్ గరం గరం

రాహుల్ చంద్రబాబు అభివృద్ధి దృక్పధాన్ని మెచ్చుకోవడం సిమ్లా ఉన్న సిఎం రాజశేఖరరెడ్డికి మండుకొచ్చిందని చెబుతున్నారు. అంత మంచుకొండల్లా ఉన్నా ఆయన భగభగ మండిపోయి ఉంటారని ఆయన క్యాంప్ వర్గాలు ఇక్కడ చెవులు కొరుక్కుంటున్నాయి. రేపు ఉదయం హైదరాబాద్ మీడియా ముందుకు రానున్న వైఎస్ రాహుల్ వ్యాఖ్యలపై జవాబు చెప్పుకోవలసిన పరిస్ధితి ఏర్పడవచ్చు. దీనిపై సోనియాగాంధీతో నేరుగా మాట్లాడి తన నిరసన తెలిపే ధైర్యం వైఎస్ చేయకపోవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు అసాధ్యమని, మహా కూటమే అధికారంలోకి వస్తుందని ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతే రాహుల్ ఈ వ్యాఖ్య చేశారని మరో అభిప్రాయం విన్పిస్తోంది.












Click it and Unblock the Notifications