టాప్ స్లాట్ లోకి వస్తున్న రవితేజ!

Ravi Teja
ఏడాది మొత్తమ్మీద ఎక్కువ సినిమాలు చేసి అందరికంటే ఎక్కువగా సైలెంట్ గా సంపాదించుకుంటున్న హీరోగా రవితేజ గురించి ఇండస్ట్రీ వారికి బాగా తెలుసు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు ఏడాదికి సగటున ఒక సినిమా చేసి ఐదు కోట్లు సంపాదిస్తే రవితేజ మూడు నాలుగు సినిమాలు చేసి పది కోట్లు సంపాదిస్తున్నట్టు ట్రేడ్ వర్గాల కథనం. ఈ ముగ్గురు హీరోలతో పోల్చుకుంటే వయసు బాగా ఎక్కువైనా కన్సిస్టెన్సీ రవితేజ విజయ రహస్యం. నటనలో అప్పుడప్పుడు వెకిలితనం తొంగిచూసినా ఈజ్ ఇతని బ్రహ్మాస్త్రం. సినిమారంగంలో గాడ్ ఫాదర్లు లేకపోయినా స్వశక్తితో, సామర్ధ్యంతో పైకి వచ్చినవాడు. ప్రస్తుతం నాలుగు సినిమాలు ఒప్పుకున్నాడు. రెండు సినిమాల్ షూటింగ్ లు జరుగుతున్నాయి.

చిరంజీవి ఒకానొక దశలో ఏడాదికి మూడు సినిమాల్లో నటించేవారు. ఆయన కన్సిస్టెన్సీకి మారుపేరు. అయనకున్నంత స్టార్ డం లేకపోయినా కుర్ర హీరోలతో పోల్చుకుంటే ఆ లక్షణం మెండుగా ఉన్నది రవితేజకే. కుర్ర హీరోలు అంత స్పీడుగా లేని ఈ సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని నెంబర్ వన్ స్లాట్ కు ఎదగడానికి రవితేజ ప్రయత్నిస్తున్నట్టు కన్పిస్తోంది. మంచి మాస్ మసాలా కథలు తయారు చేసుకుని రావలసిందిగా అయన రచయితలకు చెబుతున్నారట. మసాలా సినిమాలు హిట్ అయితే ఎవరైనా అగ్రస్ధానానికి ఎదిగిపోతారన్నది వాస్తవం. కుర్ర హీరోలకు ఇమేజి ఇబ్బందులు ఉండడం వల్ల వారికి కొంత కాలానికి కథలు కరువయ్యే ప్రమాదం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చాలా ఏళ్లపాటు ఇదే ఇబ్బంది ఎదురైంది. ఇమేజి చట్రంలోకి రావడం ఇష్టం లేని రవితేజ అన్నిరకాల పాత్రలను ఇష్టపడుతుంటాడు. ఇది కూడా అతనికి ప్లస్ పాయింట్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+