అధినాయకుడు చిరు కాదు, బాలయ్య

చిరంజీవి తన 150వ చిత్రాన్ని చేస్తారో చేయరో తెలియని సందిగ్ధ స్థితిలో బాలకృష్ణ హీరోగా అధినాయకుడు టైటిల్‌తో ఓ సినిమా తెరకు ఎక్కుతున్నట్లు సమాచారం. ఈ టైటిల్‌ను బాలకృష్ణ రిజిష్టర్ చేయించారని కూడా అంటున్నారు. నిజానికి, బాలకృష్ణ నటిస్తున్న ఓ చిత్రానికి మహదేవనాయుడు అని పేరు పెడదామని అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే కోడి రామకృష్ణ దర్శకత్వంలో హరహర మహదేవ రూపుదిద్దుకుంటుంది. రెండు పేర్లు ఒకే రకంగా ఉంటాయనే ఉద్దేశంతో ఆ పేరు మార్చాలని అనుకున్నారట. మహదేవ నాయుడు పేరుకు బదులు బాలయ్య సినిమాకు అధినాయకుడు అని పేరు పెట్టినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications